
టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (Raja Saab) చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగం పెంచారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ‘సహనా సహనా’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు.
Read Also: Sobhita Dhulipala: నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది
‘సహనా సహనా.. నా సఖి సహనా.. కలలో నిన్నే చూసానా’ అంటూ సాగిన ఈ పాట వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రభాస్ – నిధి అగర్వాల్ లపై చిత్రీకరించిన ఈ సాంగ్.. విజువల్ గానూ బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దీనికి ఎస్. తమన్ బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ విశాల్ మిశ్రా, శృతి రంజని కలిసి పాడారు. 14 రీల్స్ బ్యానర్ (Raja Saab)పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: