పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన ‘రాజాసాబ్’ (Raja Saab Collections)చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అనంతరం మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా ఈ సినిమా బలమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.
Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ Sacnilk వివరాల ప్రకారం, విడుదలైన తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.161 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో భారతదేశంలో రూ.129.20 కోట్ల గ్రాస్, విదేశీ మార్కెట్లలో రూ.31.80 కోట్ల గ్రాస్ ఆదాయం వచ్చినట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: