దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై (‘Varanasi’ Movie) అంచనాలు పెరుగుతున్నాయి. ‘వారణాసి’కి సంబంధించిన మరో కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు (Mahesh Babu) తండ్రి పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఈ పాత్ర కోసం పలువురు సీనియర్ నటులతో లుక్ టెస్టులు నిర్వహించిన రాజమౌళి చివరకు ప్రకాష్‌రాజ్ (Prakash Raj) ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదుగానీ ప్రకాశ్ రాజ్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్‌లో అడుగుపెట్టారని,
Read Also: Akhanda 2 Day 3 Collections: మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

ట్రాక్ రికార్డ్
ఆయనపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో “మహేష్ తండ్రిగా ప్రకాశ్ రాజ్” (Prakash Raj) అన్న వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ కాంబినేషన్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. గతంలో ఒక్కడు, పోకిరి, అతడు, అర్జున్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు వంటి సినిమాల్లో మహేష్‌బాబు – ప్రకాశ్ రాజ్ కలిసి నటించారు. ముఖ్యంగా దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో ప్రకాశ్ రాజ్ మహేష్‌కు తండ్రిగా కనిపించి బలమైన ఎమోషన్‌ను పండించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: