हिन्दी | Epaper

Prabhas: ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?

Anusha
Prabhas: ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి, ఆయన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన నటుల్లో ప్రభాస్ ఒకరు. ఇటీవలే ప్రభాస్, రాజా సాబ్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.

Read Also: Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

Prabhas: Raja Saab enters OTT.. Streaming date, platform details?
Prabhas: Raja Saab enters OTT.. Streaming date, platform details?

జియో హాట్ స్టార్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది

గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్ (Prabhas) ను వింటేజ్ లుక్ తో పాటు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూసి ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు.జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రాజా సాబ్ సినిమా ఓటీటీ డీల్ పూర్తయ్యిందని.. ఓ ప్రముఖ సంస్థ రాజా సాబ్ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా డిజిటల్ హక్కులను  రూ. 80 కోట్లకు అమ్మారని తెలుస్తుంది. అన్ని భాషల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ రాజా సాబ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే రాజా సాబ్ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870