పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ‘హరిహర వీరమల్లు’ – రెడీ అవ్వండి పవర్‌స్టార్మ్‌కు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ, వ్యక్తిగత బిజీ షెడ్యూల్ మధ్య కూడా డెడికేటెడ్ గా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారని మేకర్స్ వెల్లడించారు. రాత్రి 10 గంటలకు స్టూడియోలోకి వెళ్లిన పవన్, కేవలం నాలుగు గంటల్లోనే తన డబ్బింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “పవర్‌స్టార్మ్‌కు సిద్ధంగా ఉండండి.. జూన్ 12న థియేటర్లలో కలుద్దాం” అంటూ మేకర్స్ అభిమానులకు సందేశం ఇచ్చారు.

రెండు భాగాలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎపిక్
ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తనదైన శైలిలో అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కథ పరంగా ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ, ఆధునిక టెక్నాలజీ, విజువల్స్‌తో ప్రేక్షకులను కొత్త అనుభూతికి తీసుకెళ్లే విధంగా రూపొందించారు. ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రం మొదటి భాగమే. తరువాతి భాగం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ సాహసోపేతమైన పాత్రలో కనిపించనున్నాడు. ప్రాచీన భారతదేశపు రాజ్యాంగ, రాజకీయ, మత సంఘర్షణల నేపథ్యంతో కూడిన ఈ చిత్రం.. ఒక యోధుడి ధైర్యాన్ని, దేశభక్తిని హైలైట్ చేస్తుంది.
పవన్ సరసన నిధి అగర్వాల్ – విభిన్న తారాగణం
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా ఎంతో బలమైనదిగా ఉంటుందని సమాచారం. అలాగే అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్‌గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సంగీతంగా కీరవాణి మ్యాజిక్.. పాటలతోనే సందడి
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించటం మరో ముఖ్య ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన పాటలు ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననంస’ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ‘తార తార నా కళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అనే పాట కూడా యూత్‌కు బాగా నచ్చుతోంది. వీటన్నింటి పట్ల సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. పవన్ అభిమానులైతే ఈ పాటలను సోషల్ మీడియాలో బీట్స్‌తో, రీల్స్‌తో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల స్పెషల్ మేజిక్
పవన్ కళ్యాణ్ నటించిన ప్రతీ సినిమాలో ప్రత్యేకత ఉంటుంది. ఆయన కేవలం నటుడే కాకుండా, సామాజిక విషయాల పట్ల తన చైతన్యాన్ని ప్రదర్శించే వ్యక్తి. అలాంటి ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాలు మన తెలుగు తెరపై పెద్దగా కనిపించకపోయినా.. ఈ సినిమా ఒక మంచి మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. క్రిష్, కీరవాణి, పవన్ కలయికలో వస్తున్న ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ పరంగా ఎంతో గొప్పగా ఉండబోతోందని సమాచారం.
Read also: Rajesh: ప్రముఖ నటుడు రాజేశ్ ఇకలేరు