కొన్నేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులు బాగా చూసేసిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. కథ పరంగా చూస్తే, ఇది ఒక సాధారణ మధ్యతరగతి దంపతుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు, అహంకారం, ఈగో, వంటి అంశాలను కథలో ప్రధానంగా చూపించారు. అయితే,ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ (Om Shanti Shanti Shantihi Movie Review) లో చూద్దాం.
Read Also: Music Director: ‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
కథ
చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ల ఇష్టాలపైనే ప్రతి పని చేస్తూ.. తన ఇష్టాల్ని ఎవరూ పట్టించుకోరేంటి అనే బాధతో బతుకుతూ ఉంటుంది ప్రశాంతి (ఈషా రెబ్బా). ఆటల్లో, చదువుల్లో చివరికి పెళ్లిలో కూడా పెద్దవాళ్లు చెప్పిన మాటే వినాల్సి వస్తుంది. కనీసం చేసుకునేవాడైనా తనని అర్థం చేసుకుంటాడు.. తన ఇష్టాలకి గౌరవం ఇస్తాడని అనుకుంటుంది. కానీ తను చేసుకున్న ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) పెద్ద కోపిష్టి..

ముక్కు మీద కోపం ఉన్న మనిషి.. మగాడు అనే అహంకారంతో బతుకుతున్న వ్యక్తి అని కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటుంది.పైగా చిన్నచిన్నవాటికి తన మీద చేయి చేసుకునే సరికి ప్రశాంతి తట్టుకోలేకపోతుంది. ఆ బాధని, కోపాన్ని తన లోపలే దాచుకొని.. తన భర్తకి అతని దారిలోనే బుద్ధి చెప్తుంది. ఇక తర్వాత ఏం జరిగింది.. ? ఇద్దరి సంసారం ఏమైంది..? ఏంటి అనేది ఒరిజినల్ చూసిన వారికి ఎలాగో తెలుసు.. చూడకపోతే కనుక తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కథనం
మహిళా సాధికారత, సమానత్వం అనే బరువైన పాయింట్‌ని కామెడీ కోటింగ్ ఇచ్చి చెప్పే ప్రయత్నమే ఈ ఓ శాంతి శాంతి శాంతిః. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో కథ నడవడం, అక్కడి యాస, నేటివిటీ సినిమాకి ఫ్రెష్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల పెంపకంపై ఉండే ఆంక్షలను దర్శకుడు చాలా నేచురల్ గా, కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫస్టాఫ్ అంతా పెళ్లి చూపులు, భర్త పెత్తనం, ఆ గొడవలతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో సీన్ రివర్స్ అయ్యి భర్తని భార్య కొట్టడం, ఆ బాధని ఓంకార్ బయటకి చెప్పుకోలేక పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి.
అయితే, సినిమాని పూర్తిగా కామెడీ వైపు మళ్లించే ప్రయత్నంలో ఎమోషన్ మిస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో ఉండాల్సిన టైట్ నెస్ లోపించింది. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. సినిమా మొత్తం ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎంట్రీ కాస్త రిలీఫ్ ఇచ్చినా.. ముగింపు హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్లకు ఇది కిక్ ఇవ్వదు గానీ చూడని వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: