మలయాళంలో స్టార్ అయినా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా స్థిరమైన స్థానం ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). ఆయన నటనలో ఉన్న సహజత్వం, స్క్రిప్ట్ ఎంపికలో చూపే చాకచక్యం వల్ల ఆయన సినిమాలపై ఆసక్తి స్వతహాగా పెరుగుతోంది.వచ్చింది మలయాళం నుంచే అయిన తెలుగులో మినిమం గ్యారంటీ హీరోలా మారిపోయాడు ఈ కుర్రహీరో. అయితే దుల్కర్ నటించిన మరో మలయాళ చిత్రం తాజాగా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. దుల్కర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఒరు యమండన్ ప్రేమకథ’. సంయుక్త మీనన్(Samyuktha Menon) కథానాయికగా నటించింది. ఈ సినిమాను తాజాగా తెలుగులో తీసుకువచ్చింది భవాని మీడియా. ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమాను ‘ఒక యముడి ప్రేమకథ’ పేరుతో విడుదల చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
కథ ఏంటంటే
ఈ చిత్రం జాన్ అలియాస్ లల్లూ (దుల్కర్ సల్మాన్) అనే పెయింటర్ కథ. జాన్ ప్రేమ వివాహం చేసుకోవాలని కలలు కంటాడు. ఒకరోజు వార్తాపత్రికలో దియా (నిఖిలా విమల్) అనే అమ్మాయి ఫోటో చూసి, ఆమెను ఇష్టపడతాడు.తన స్నేహితులతో కలిసి ఎంత ప్రయత్నించినా దియా ఆచూకీ దొరకదు. అయితే కొంతకాలం తర్వాత, దియా(Dia) హత్యకు గురైందని జాన్‌కు తెలుస్తుంది. దీంతో హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దియాను హత్య చేసిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Read Also: Thug Life Movie: ‘థగ్ లైఫ్ ’ మూవీ రివ్యూ