పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా సంతోషకర వార్త. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన OG Movie తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మే 12 నుంచి తిరిగి ప్రారంభమైంది.DVV ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. “మళ్లీ మొదలైంది… ఈసారి ముగిద్దాం!” అంటూ ఓ స్టిల్స్‌ను షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య బాగా వైరల్ అవుతోంది.తాజా షెడ్యూల్ ప్రారంభం అయినప్పటికీ పవన్ కల్యాణ్ సెట్లో ఉన్నారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ఆయన ఎప్పుడు సెట్లో అడుగుపెడతారన్న ఆసక్తి మాత్రం నెలకొంది. ఏం అయినా సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది అనే విషయమే ఫ్యాన్స్‌కి పెద్ద విజయం.

ఫ్యాన్స్‌కి ఇది మెగా బూస్ట్
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించడం అభిమానులను పూనకాలకు గురిచేసింది. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ కావడంతో, మళ్లీ అదే ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది.ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్‌ను పవన్ పూర్తి చేశారు. ఆ తర్వాత వెంటనే ‘ఓజీ’ సినిమాపై ఫోకస్ చేశారు. ఈ నేపధ్యంలో మే 12 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నట్టు సమాచారం.
స్టార్ కాస్టింగ్, భారీ అంచనాలు
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. పవన్-ప్రియాంక కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఈ జంట తెరపై ఎలా కనిపిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
థమన్ మ్యూజిక్ – మరో హైలైట్
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ – థమన్ కాంబినేషన్ ఇప్పటివరకు బ్లాక్‌బస్టర్లే ఇచ్చింది. కాబట్టి ‘ఓజీ’ సౌండ్‌ట్రాక్‌పై కూడా భారీ అంచనాలున్నాయి.ఓజీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక పెద్ద బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ అన్నింటినీ చూస్తే, ఇది పక్కా పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు.
Read Also :RRR Concert : ఫ్యాన్స్ పై తారక్‌కు అసహనం