తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టితన టాలెంట్‌తో స్టార్‌డమ్ సాధించిన తారక్ … నటన పరంగా ఎన్నో మైలురాళ్లను దాటాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ఆయన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
Read Also: Chiranjeevi: ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

కొత్త లుక్
కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చూపించిన ఎమోషన్, ఇన్‌టెన్సిటీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆ సినిమా తర్వాత తారక్ (Jr NTR) పేరు గ్లోబల్ హీరోల జాబితాలో చేరింది.ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. సినిమాల పరంగా ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత స్టైల్, లుక్‌లపై మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది.
తాజాగా ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్న ఫొటో చూసి లుక్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో బాడీ డబుల్ లేకుండా ఎన్టీఆరే స్టంట్స్ చేస్తారని సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: