हिन्दी | Epaper

Nikhil: ‘స్వయంభు’ టీజర్ రిలీజ్

Aanusha
Nikhil: ‘Swayambhu’ teaser released
Nikhil: ‘Swayambhu’ teaser released

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) సిద్ధార్థ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా, తాజాగా చిత్రబృందం విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర‌బృందం నేడు అధికారికంగా విడుదల చేసింది..

Read Also: Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

రాణి పాత్రలో నభా నటేష్

ఈ పీరియాడికల్ యాక్షన్ ప్రాజెక్ట్‌కు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోంది. హీరోయిన్‌లుగా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. సంయుక్త యోధురాలిగా కనిపిస్తుండగా, నభా నటేష్ రాణి పాత్రలో కనువిందు చేస్తోంది. సంగీతాన్ని ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ అందిస్తుండగా, విజువల్స్ బాధ్యతలను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ నిర్వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870