టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఆమె ఏదో అనుకుని పోస్టులు పెడితే నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాగే ఇన్‌స్టాలో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకు సమంత ఇన్‌స్టా లో ఏం పోస్ట్ పెట్టిందంటే, ‘నదులు తమ నీటిని తాము తాగవు. చెట్లు తమ పండ్లను తినవు. సూర్యుడు తన కోసం ప్రకాశించడు. పువ్వులు తమ సువాసనను తాము పీల్చకోవు. ఇతరుల కోసం జీవించడమే ప్రకృతి నియమం. మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి పుట్టాం. ఎంత కష్టమైనా సరే సంతోషంగా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది; కానీ మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా మంచిది’ అని పోన్ ఫ్రాన్సిస్ చెప్పారంటూ సమంత ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
పదజాలం
సమంత పోస్ట్‌ని స్క్రీన్ షాట్ తీసిన పెద్ది రెడ్డి అనే ఓ నెటిజన్, దాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఆమెపై నోరుపారేసుకున్నాడు. ‘విడాకులు తీసుకుంది, రోగం వచ్చింది అని సమంత మీద కాస్త సాప్ట్ కార్నర్ ఉండేది. సాయం చేయడానికి వాళ్లేమైనా మనుషులు అనుకున్నావా తీవ్రవాదులు. నీకు అంత హెల్పింగ్ నేచర్ ఉంటే పాకిస్థాన్‌కి వెళ్లి చేసిరా, అంతేగాని ఇక్కడ మాట్లాడకు’ అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయాడు.ఈ ట్వీట్ ఆధారంగా చాలామంది నెటిజన్లు సమంతని ట్రోల్ చేస్తుండగా మరికొంతమంది ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్‌కి నివాళిగా సమంత పోస్ట్ చేస్తే దాన్ని ఎందుకు కాంట్రవర్సి చేస్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. దీనికి కొందరు కౌంటర్ ఇస్తూ పోప్ ఏప్రిల్ 21న చనిపోతే మరుసటిరోజు అంటే ఏప్రిల్ 22న కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిన రోజే సమంత ఎందుకు పోస్ట్ పెట్టిందని నిలదీస్తున్నారు. సమంత క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసే నాగచైతన్య, నాగార్జున ఆమెని వదిలించుకున్నారని పర్సనల్ లైఫ్ గురించి కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే పోప్ కోసం ఆ పోస్ట్ పెట్టి ఉంటే మరెందుకు డిలీట్ చేసిందని ప్రశ్నిస్తున్నారు.
ఉగ్రవాదుల
ప్రస్తుతం ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనలో 27 మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై సెంట్రల్ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. హల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Read Also: Manoj Bajpayee : సత్య సినిమా నాకు గుర్తింపును తెచ్చిపెట్టింది : మనోజ్ బాజ్‌పేయ్