हिन्दी | Epaper

Nandamuri Balakrishna: బాలకృష్ణ కు పుట్టినరోజు విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్

Sharanya
Nandamuri Balakrishna: బాలకృష్ణ కు పుట్టినరోజు విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్

టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) నేడు (జూన్ 10) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని, ప్రజా సేవను కొనియాడారు.

పవన్ కల్యాణ్ సందేశం:

“శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బాలకృష్ణ చారిత్రక, జానపద, పౌరాణిక వంటి విభిన్న పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన ప్రశంసించారు.

ప్రజా సేవకు అభినందనలు:

కేవలం సినీ రంగంలోనే కాకుండా, ప్రజా జీవితంలోనూ బాలకృష్ణ చేస్తున్న సేవలను పవన్ కల్యాణ్ అభినందించారు. “దైవ భక్తి మెండుగా కలిగిన శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను అందించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని తన ప్రకటనలో పేర్కొన్నారు.

Read also: Chiranjeevi: యోగా ప్రపంచానికి ఒక గొప్ప బహుమతి: చిరంజీవి

Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870