దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల కొందరు కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, సినీ పరిశ్రమలో తన ప్రయాణం, అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఆ సినిమాలకు తాను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేదని అనిపించినట్లు పేర్కొన్నారు. అయితే, వేరే దర్శకుల సినిమాలను తాను డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదని మాత్రం ఎప్పుడూ అనిపించలేదని స్పష్టం చేశారు.ఖలేజా మూవీ ఇప్పటికీ, ఎప్పటికీ ఫ్యాన్స్‌కే కాకుండా ఓ వర్గానికి కూడా ఎవర్ గ్రీన్ మూవీగా ఉంటుంది. ఆ సినిమాలోని డెప్త్, లైన్‌ను అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అసలు దేవుడు అనే కాన్సెప్ట్ మీద సినిమా అని చెప్పడంతో అభిమానులు, ఆడియెన్స్ వేరేలా ఊహించుకున్నారు. దీంతో మొదటి రోజు మొదటి ఆట చూసి అంతా షాక్ అయ్యారు. అలా డివైడ్ టాక్ వచ్చి సినిమా పోయింది. కానీ ఆ తరువాత త్రివిక్రమ్ ఇచ్చిన ఉదాహరణలు, వివరణలతో అసలు తాత్వర్యం అందరికీ బోధపడింది.ఇప్పుడు ఖలేజా ఎవర్ గ్రీన్, హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది. అయితే తాజాగా నాగ్ అశ్విన్ కూడా ఖలేజా మీద తనకున్న ప్రేమను పంచుకున్నాడు. ఖలేజా పాయింట్ పరంగా, వేదాంత ధోరణిలో చూసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది.
నటీనటుల ఎంపిక
సినిమా విజయంలో ఎడిటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, తాను కూడా గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఎడిటర్‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తాను హాస్యాన్ని ఇష్టపడతానని, ముఖ్యంగా దివంగత దర్శకుడు జంధ్యాల సినిమాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు.తన దర్శకత్వ శైలి గురించి వివరిస్తూ, ముందుగా కథను సిద్ధం చేసుకున్నాకే అందులోని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసుకుంటానని నాగ్ అశ్విన్ వివరించారు. ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించానని, కథలోని పాత్రలను దృష్టిలో ఉంచుకుని మొదట అమితాబ్ బచ్చన్‌ను, ఆ తర్వాత ప్రభాస్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు.

టీమ్ కృషి
‘కల్కి’ లాంటి భారీ చిత్రం వెనుక తన ఒక్కడి కష్టమే కాదని, అది ఒక టీమ్ కృషి అని, టీమ్‌లోని ప్రతి ఒక్కరి సలహాలను స్వీకరిస్తానని అన్నారు. మహాభారతం ఆధారంగా సినిమా తీయడం కొంత భయంగా అనిపించినా, ప్రతి సన్నివేశం వెనుక ఎంతో పరిశోధన, కృషి ఉందని వెల్లడించారు.పరిశ్రమలో విజయవంతంగా కొనసాగాలంటే కష్టపడి పనిచేయడం, పుస్తకాలు చదవడం వంటివి చాలా ముఖ్యమని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టును ఇదే చివరిది అనేంత నిబద్ధతతో చేయాలని, పుస్తకాలు సినిమాల కంటే ఎక్కువగా మనపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఒక సాధారణ కథను కూడా ఆసక్తికరంగా చెప్పగలగడమే రచయిత నైపుణ్యమని అన్నారు.
Read Also: ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా