हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Mrithyunjay Movie Review: శ్రీవిష్ణు థ్రిల్లర్ మెప్పించిందా?

Aanusha
Mrithyunjay Movie Review: శ్రీవిష్ణు థ్రిల్లర్ మెప్పించిందా?

Mrithyunjay Movie Review: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు అంటేనే విలక్షణమైన కథలకు కేరాఫ్ అడ్రస్. కెరీర్ ఆరంభం నుండి కంటెంట్ ఉన్న సినిమాలతో ఆకట్టుకున్న ఆయన, ఈ మధ్య కాలంలో ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాలతో ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్ ఎక్కారు. అయితే, గత వారం రిలీజ్ అయిన ‘విష్ణు విన్యాసం’ తర్వాత కేవలం వారం గ్యాప్‌లోనే ‘మృత్యుంజయ్’ అనే సీరియస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ మర్డర్ మిస్టరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

Read Also: Naga chaitanya : వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం

కథ:

జై (శ్రీవిష్ణు) ఓ దినపత్రికలో అడ్వర్టైజ్‌మెంట్స్ తీసుకొచ్చే ఉద్యోగం చేస్తుంటాడు. ఎప్పటికైనా మంచి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలన్నది అతని కల. అయితే తనకున్న టార్గెట్స్ కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వాళ్ళ చేత పేపర్‌లో శ్రద్ధాంజలి యాడ్స్ వేయిస్తుంటాడు. ఆ క్రమంలో ఒకసారి అచ్యుత్ రావ్ (బాల ఆదిత్య) అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ అచ్యుత్ కూతురు అంజలి ఏడవకుండా దీనంగా ఉండటం జైని కదిలిస్తుంది. నీ తండ్రి మరణానికి గల కారణం కనుక్కుంటానని ఆ పాపకు మాటిస్తాడు.

సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ రెండు కేవలం ప్రమాదాలు కావని, పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యలని జైకి అనుమానం వస్తుంది. ఈ రెండు కేసులను డీల్ చేస్తున్న ఏసీపీ సీత పరశురాం (రెబా మోనికా జాన్)కి హీరో తన ఇన్వెస్టిగేషన్‌తో ఎలా సాయపడ్డాడు? అసలు ఎలాంటి క్లూ వదలకుండా ఆ హత్యలు చేస్తున్న ఆ కనిపించని హంతకుడు ఎవరు? అతని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? అనేది మిగతా కథ.

Mrithyunjay Movie Review:
Mrithyunjay Movie Review

కథనం

థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే అత్యంత కీలకం. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ సక్సెస్ అయ్యాడు. సినిమా మొదలైన పది నిమిషాలకే అసలు కథలోకి తీసుకెళ్లిపోవడం, అనవసరమైన కామెడీ ట్రాక్స్, పాటలు ఇరికించకుండా కంటెంట్‌కి కట్టుబడి సినిమాను నడపడం అతిపెద్ద ప్లస్ పాయింట్.

ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరో, విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. విలన్ ఎవరు అనేది ప్రేక్షకులకు ముందే తెలిసినా, హీరో అతన్ని ఎలా ట్రాక్ చేసి పట్టుకుంటాడనే ప్రాసెస్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. అయితే క్లైమాక్స్‌లో హంతకుడికి డీల్ ఇచ్చిన అసలు వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేయించారు అనే మోటివ్‌ను ఇంకాస్త బలంగా, క్లియర్‌గా వివరించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870