हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

MrBeast: యూట్యూబర్ గా వేల కోట్లు సంపాదించిన మిస్టర్‌బీస్ట్

Sharanya
MrBeast: యూట్యూబర్ గా వేల కోట్లు సంపాదించిన మిస్టర్‌బీస్ట్

యూట్యూబ్ సంచలనం మిస్టర్‌బీస్ట్ (MrBeast) గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ (Jimmy Donaldson) 27 సంవత్సరాల వయసులోనే బిలియనీర్ స్థాయికి చేరి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాడు. సెలబ్రిటీ నెట్ వర్త్ సంస్థ అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ ప్రస్తుతం 1 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే రూ. 8,300 కోట్లకు పైగా ఉంది. ఈ మొత్తం సంపద ఆయన స్వయంగా, తన ప్రతిభతో కూడిన కృషి ద్వారా సంపాదించగా, ఇందులో ఏమాత్రం వారసత్వ సంపద లేదు అనే అంశం మరింత ప్రత్యేకతను ఇస్తోంది. కేవలం 27 ఏళ్ల వయసులోనే సంపాదించారన్నమాట.

చిన్న వయసులో ప్రారంభమైన గొప్ప ప్రయాణం

జిమ్మీ డొనాల్డ్సన్ యూట్యూబ్‌కి 13 సంవత్సరాల వయసులోనే అడుగుపెట్టాడు. వినూత్నమైన ఛాలెంజ్‌లు, భారీ స్థాయిలో బహుమతులు ఇవ్వడం, దాతృత్వ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2017లో “ఐ కౌంటెడ్ టు 100,000” అనే వీడియోతో ఆయనకు విస్తృత ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని వీడియోల నిర్మాణానికే ఖర్చు చేస్తూ, కంటెంట్ నాణ్యతను పెంచుకుంటూ వెళ్లారు.

వ్యాపారాల్లో విజయవంతమైన ప్రయోగాలు

యూట్యూబ్ ద్వారానే కాకుండా, “బీస్ట్ బర్గర్” అనే ఫాస్ట్ ఫుడ్ చైన్, “ఫీస్టబుల్స్” అనే చాక్లెట్ కంపెనీ వంటి విజయవంతమైన వ్యాపారాలను కూడా మిస్టర్‌బీస్ట్ నిర్వహిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం, 2023లో ఆయన ఆదాయం 223 మిలియన్ డాలర్లు. జూన్ 2024 నాటికి, యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన వ్యక్తిగా కూడా మిస్టర్‌బీస్ట్ రికార్డు సృష్టించారు. సంపాదనతో పాటు దాతృత్వంలోనూ మిస్టర్‌బీస్ట్‌ ముందుంటారు. “బీస్ట్ ఫిలాంత్రోపీ” పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేల మందికి కంటి చూపునివ్వడం, లక్షల కొద్దీ మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చనిపోయేలోపు నా దగ్గరున్న ప్రతీ పైసా దానం చేస్తాను అని మిస్టర్‌బీస్ట్‌ గతంలోనే ప్రకటించారు. తన జీవిత లక్ష్యం బాగా డబ్బు సంపాదించి, దాన్నంతటినీ మంచి పనుల కోసం ఖర్చు చేయడమేనని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు.

Read also: Heartbeat 2: ‘హార్ట్ బీట్ 2’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870