
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఇండియా టూర్ అనేది దేశవ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది. మెస్సీ తన GOAT ఇండియా టూర్ 2025ను కోల్‌కతాలో ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మెస్సీ (Lionel Messi) ని మర్యాదపూర్వకంగా కలవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Read Also: Messi: మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు
కోల్‌కతాలోని సుప్రసిద్ధ వివేకానంద యువ భారతి క్రిరంగన్ (సాల్ట్ లేక్ స్టేడియం)లో జరిగిన భారీ ఈవెంట్‌లో మెస్సీ, షారుఖ్ ఖాన్ ఒకే వేదికపైకి వచ్చి సందడి చేశారు.భారత సినిమా దిగ్గజం, ఫుట్‌బాల్ GOAT ఒకే చోట కలుసుకోవడంతో అభిమానుల ఆనందం పతాక స్థాయికి చేరింది.
ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెస్సీ గౌరవార్థం ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: