కిచ్చా సుదీప్ కి (Kichcha Sudeep) తెలుగులోనూ (Mark Movie) మంచి క్రేజ్ ఉంది. అందువల్లనే అతని కన్నడ సినిమాలు తెలుగులోను విడుదలవుతూ ఉంటాయి. అలా కన్నడలో ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ‘మార్క్’ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కన్నడలో డిసెంబర్ 25వ తేదీన విడుదలైంది. త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమా అక్కడ 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.
Read Also: Vishal Mogudu Movie: విశాల్ కొత్త సినిమా.. టైటిల్ ప్రోమో విడుదల

జనవరి 1వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఇక్కడి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమాను గురించి ఇక్కడ పట్టించుకున్నవారు లేరు. అలాంటి ఈ సినిమా (Mark Movie) ఇప్పుడు ఓటీటీ ద్వారా పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 23వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. షైన్ టామ్ చాకో నవీన్ చంద్ర విక్రాంత్ యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
మార్కండేయ ఒక పోలీస్ ఆఫీసర్. అయితే కొన్ని కారణాల వలన ఆయన సస్పెన్షన్ లో ఉంటాడు. అయితే ‘మార్క్’గా ఆయన రౌడీల ఆటకట్టిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక మాఫియా ముఠాతో పెట్టుకోవలసి వస్తుంది. అప్పటి నుంచి ఆయన మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు మార్క్ ఏం చేస్తాడు? తనకి ఎదురైన అవరోధాలను ఎలా అధిగమిస్తాడు? అనేది కథ. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే ఒక టాక్ కన్నడ థియేటర్ల దగ్గర వినిపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: