
కిచ్చా సుదీప్ కథానాయకుడిగా ‘మార్క్’ (Mark Movie) సినిమా రూపొందింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 25వ తేదీన కన్నడలో విడుదలైంది. జనవరి 1వ తేదీన తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’లో (Jio Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: Telangana HC: చిరంజీవి సినిమాకి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి
కథ
అజయ్ మార్కండేయ (సుదీప్) ఎస్పీగా పనిచేస్తూ ఉంటాడు. (Mark Movie) అందరూ అతనిని ‘మార్క్’ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం అతను కొన్ని కారణాల వలన సస్పెన్షన్ లో ఉంటాడు. అతనంటే డిపార్టుమెంటులోని అవినీతి అధికారులకు రాజకీయనాయకులకు రౌడీలకు భయమే. తన కళ్లముందు అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే, తాను సస్పెన్షన్ లో ఉన్నానని చూస్తూ ఊర్కొనే రకం కాదు అతను. అలాంటి అతను మళ్లీ రంగంలోకి దిగడానికి కారణం, ఆదికేశవన్ ( షైన్ టామ్ చాకో) భద్ర ( నవీన్ చంద్ర) స్టీఫెన్ ( గురు సోమసుందరం).
ఆదికేశవన్ తల్లి, లోకనాయకి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో, తన వారసుడిగా ముఖ్యమంత్రి కుర్చీకి ప్రయత్నిస్తున్నాడు. అతని కుట్రలు, బెదిరింపులు డాక్టర్ ద్వారా వీడియోగా రికార్డ్ అవుతాయి. మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర సింహా, మార్క్‌ను ఆ వీడియో సంపాదించమని అడుగుతాడు.
మార్క్ క్రమంగా కేసుల, గ్యాంగ్‌స్టర్ల కుట్రలను ఎదుర్కొంటూ, రుద్ర ప్రేమకథ, అక్రమ చిన్నపిల్లల తరలింపు, మరియు 2,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ వంచనలను ఎదుర్కొంటాడు. చివరికి అతను ఈ మొత్తం సవాళ్లను ఎదుర్కొని కథను ముందుకు తీసుకువెళ్తాడు.
సుదీప్ కి కన్నడలో మంచి క్రేజ్ ఉంది. తెలుగు తమిళ భాషలకు సంబంధించిన ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను బాగానే చూస్తుంటారు. సుదీప్ స్టైల్ ఆయన మార్క్ తెలిసినవారికి ఆయన సినిమాలు ఎలా ఉంటాయనేది ఒక ఐడియా ఉంటుంది. అలాంటి మార్క్ లో ఆయన చేసిన మరో సినిమానే ఇది. రొమాన్స్ వైపు వెళ్లకుండా ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ నేపథ్యంలో ఆయన చేసిన సినిమా ఇది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: