Manchu Lakshmi: టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి తన నిర్మాణ రంగ ప్రస్థానానికి ముగింపు పలికినట్లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం తాను నిర్మించిన ఒక సినిమా వల్ల వచ్చిన నష్టాలు, అప్పులు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని, అందుకే ఇకపై కేవలం నటనపైనే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తాను నిర్మించిన ఒక సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చిందని ఆమె తెలిపారు. ఆ నష్టాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని చెప్పారు.
Read Also: Madras HC-Vishal: నటుడు విశాల్‌కి హైకోర్టులో చుక్కెదురు

ఆ అధ్యాయం ముగిసిపోయింది
ఆ సినిమా కోసం చేసిన అప్పులను ఇప్పటికీ కట్టుకుంటున్నానని తెలిపారు. అందుకే నిర్మాతగా తన జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయిందని చెప్పారు. ఇకపై నటనపైనే పూర్తి దృష్టి పెడతానని తెలిపారు.నిర్మాత సాధకబాధకాలు తనకు తెలుసని..అందుకే, ఎవరైనా స్క్రిప్ట్ పట్టుకొని వస్తే ముందుగా ‘నిర్మాత ఎవరు?’ అని అడుగుతున్నానని..నిర్మాత ఉన్నప్పుడే మాట్లాడమని చెబుతున్నానని మంచు లక్ష్మి చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
‘అనగనగా ఓ ధీరుడు’లో ప్రతినాయకురాలిగా మెప్పించి నంది, సైమా అవార్డులు అందుకున్నారు. ‘చందమామ కథలు’, ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాలతో సహాయ నటి విభాగంలో ప్రశంసలు దక్కించుకున్నారు. మరోవైపు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే నిర్మాతగా ఆమె ప్రయాణం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ‘దొంగాట’, ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’, ‘దక్ష’ వంటి చిత్రాలను నిర్మించినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా ‘దక్ష’ సినిమా విడుదలలో ఆలస్యం, సినిమా డిజాస్టర్ కావడం ఆమెను ఆర్థికంగా దెబ్బతీసినట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: