ప్రస్తుతం పాన్ ఇండియా సినీరంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటీమణుల్లో ఒకరు అలియా భట్. బాలీవుడ్ నుంచి తన కెరీర్‌ను ప్రారంభించి, ఎంతో కొద్ది కాలంలోనే అగ్రనటి స్థాయికి చేరుకున్న ఈ అందాల భామ ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో కూడా తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలియా భట్ (Alia Bhatt) తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి, ఆ తర్వాతి ప్రాజెక్టులలోనూ వేరువేరు రకాల పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు లభించిన పాత్రలు సవాళ్లతో నిండినవే అయినప్పటికీ, వాటిని తన నటనతో సమర్థవంతంగా నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
అలియా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ అగ్రహీరో రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లి జరగటం విశేష చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరి దాంపత్య జీవితం ప్రస్తుతం సంతోషంగా కొనసాగుతోంది. వీరికి రాహా అనే చిన్నారి పుట్టడం మరింత ఆనందాన్ని తెచ్చింది. తల్లిగా మారిన తర్వాత కూడా అలియా తన కెరీర్‌ను సమతుల్యంగా కొనసాగిస్తూ, కుటుంబానికి, సినీ రంగానికి సమాన ప్రాధాన్యం ఇస్తోంది.అలియా భట్ కెరీర్‌లో హిట్ సినిమాల పరంపర కొనసాగుతోంది.
సినీ అభిమానుల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్
‘రాజీ’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘హైవే’, ‘డియర్ జిందగీ’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాలతో ఆమె తన నటన వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ప్రతీ చిత్రంలో వేరే కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అలియాకు ఉన్న గుర్తింపు విశేషం. హిందీతో పాటు తెలుగు, తమిళ సినీ అభిమానుల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.అలియా భట్ తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కు భిన్నంగా, కొంచెం కొత్తదనం, కంటెంట్ ఆధారిత కథలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది.
రాహా (Raaha) ఎంజాయ్ చేసే సినిమాలు నేను ఇప్పటి వరకు చేయలేదు. ఇకపై తను నవ్వుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నా. కామెడీ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు నా కూతురి కోసం జానర్ మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ అంగీకరించాను. అవేంటో ఇప్పుడే చెప్పలేను. త్వరలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని అలియా పేర్కొంది. ఇక దర్శకుడు మహేష్ భట్ కుమార్తె గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్, కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది
తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రశంసలు అందుకున్నఈ ముద్దుగుమ్మ కెరీర్‌లో అనేక అవార్డులను దక్కించుకుంది. అయితే అలియా భట్12వ తరగతి కూడా పూర్తి చేయలేదు. చదువు మధ్యలోనే మానేసి నటనపై ఆసక్తి పెంచుకున్న అలియా భట్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నివేదికల ప్రకారం అలియా ఆస్తులు రూ. 4,600 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ భామ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించింది.
Read hindi news : hindi.vaartha.com
Read also: