ధనుష్ నటించిన తాజా చిత్రం ‘కుబేరా’ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన బైలింగ్వల్ చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, మొదటిసారి ధనుష్‌తో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. కథానాయికగా రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించిన ఈ చిత్రంలో జిమ్ సార్బ్, సయాజీ షిండే, సునయన, హరీష్ పెరాడి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోచించారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌పై నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించగా, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మిరెడ్డి అందించారు.
కథ సంగ్రహం
‘కుబేరా’ కథ ఓ సాధారణ వ్యక్తి అసాధారణ మార్పు పొందిన నేపథ్యంలో సాగుతుంది. కథలో అత్యంత కీలకంగా మారే అంశాలు: ధనం, శక్తి, ఆశ, ద్వంద్వ నీతి, విమోచన కోసం నడిపే పోరాటం. ఈ అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.జిమ్ సార్బ్ పాత్రలో కనిపించే నీరజ్ అనే బిజినెస్ టైకూన్ – దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను ఒక లక్ష కోట్ల రూపాయల లంచంతో అందర్నీ కొనేస్తాడు. బంగాళాఖాతంలో నూతనంగా కనుగొన్న ఆయిల్ రిజర్వుల నియంత్రణను చేజిక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. ఈ భారీ ఆపరేషన్‌ను రహస్యంగా నిర్వహించేందుకు దీపక్ (Deepak) అనే మాజీ సీబీఐ అధికారిని సాయం కోరుతాడు.ఈ కుట్రలోకి అనుకోకుండా ధనుష్ పోషించిన దేవా పాత్ర ప్రవేశిస్తుంది. దేవా,దీపక్ మధ్య సన్నివేశాలు కథను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతాయి. అయితే ఇదే సమయంలో కథలోకి ప్రవేశించే సమీరా పాత్ర కథను మలుపుతిప్పే విధంగా ఉంటుంది.సమీరా అసలు పాత్ర ఏమిటి? ఆమె ఎవరి వైపుగా నిలుస్తుంది? అనేది ఆసక్తికరంగా మారుతుంది.

టెక్నికల్ & ప్రదర్శన అంశాలు
ఈ చిత్రంలో ప్రధానంగా ధర్మం, నీతి, కర్తవ్యపరమైన విలువలు ఎంత అవసరమో చూపించారు. నీరజ్ ఆఖరికి విజయవంతమవుతాడా? దీపక్ తన మునుపటి సత్యవంతమైన గతాన్ని ఎందుకు విడిచిపెట్టి నీరజ్ పక్కన చేరాడు? దేవా పాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్నదే కథలో ప్రధాన డైలెమా. ధనుష్ (Dhanush) పోషించిన పాత్రలో ట్రాన్స్ఫర్మేషన్, నటనలో చూపించిన లోతైన భావప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. నాగార్జున పాత్రలో ఉన్న మిస్టీరియస్ వాతావరణం కూడా సినిమాకు ఆకర్షణగా మారుతుంది. రష్మిక పాత్రలోని ట్విస్ట్ క్లైమాక్స్‌ను ముందుగా ఊహించలేనంతగా మలచారు.కుబేరా చిత్రాన్ని ఒక కమర్షియల్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా, విలువల విషయంలోనూ ప్రశ్నలు రేపే కథగా నిలిచే అవకాశం ఉంది.
Read Also: Kuberaa Movie: ఏపీలో ‘కుబేర’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి