ప్రపంచవ్యాప్తంగా(Kriti Sanon) అందమైన నటీమణుల జాబితాలో ఈసారి భారతీయ నటి కృతి సనన్ ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb తాజాగా విడుదల చేసిన “ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్లు” జాబితాలో కృతి సనన్ ఐదో స్థానంలో నిలవడం విశేషంగా మారింది.ఈ జాబితాలో తొలి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్గోట్ రాబీ నిలిచింది. ఆమె అందం, అభినయం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. మార్గోట్ రాబీ తర్వాత రెండో స్థానంలో అమెరికాకు చెందిన ప్రముఖ నటి షైలీన్ వుడ్లీ నిలిచింది. తన సహజమైన నటన, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో షైలీన్ హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Read also: ‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

చైనీస్, కొరియన్ స్టార్‌లతో భారత నటి కృతి సనన్ మెరుస్తున్నది
మూడో స్థానంలో(Kriti Sanon) చైనాకు చెందిన అందాల నటి దిల్‌రుబా దిల్మురాత్ నిలిచింది. చైనీస్ సినిమా, టీవీ రంగాల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడానికి కారణమైంది. ఇక నాలుగో స్థానంలో సౌత్ కొరియాకు చెందిన నటి నాన్నీ మెక్‌డోనీ నిలవడం కూడా విశేషమే. కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతోందో ఈ జాబితా మరోసారి రుజువు చేసింది.ఇలాంటి అంతర్జాతీయ అందాల జాబితాలో భారతదేశం నుంచి కృతి సనన్ టాప్-5లో చోటు దక్కించుకోవడం నిజంగా గర్వకారణం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: