కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, గతేడాది మూడు భాషల్లో సినిమాలతో సందడి చేశారు. తెలుగులో ‘కుబేర’, తమిళంలో ‘ఇడ్లీ కొట్టు’, హిందీలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.. ఈ చిత్రాలన్నీ వేర్వేరు జానర్స్ కావడం విశేషం.
Read Also: TamilNadu: విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్
సాయి అభ్యాంకర్ ఈ సినిమాకి సంగీతం
ఈ ఏడాది మరికొన్ని చిత్రాలను విడుదలకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రాలలో ‘D 55’ ఒకటి. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధనుష్ 55వ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు.. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ”ఇది జరుగుతుందని మీరు ఊహించి ఉండరు. #D55 ప్రాజెక్ట్‌లోకి అద్భుతమైన శ్రీలీల కు స్వాగతం పలుకుతున్నాము” అని చిత్ర బృందం పోస్ట్ పెట్టింది.

ఈ సందర్భంగా ధనుష్, శ్రీలీల, రాజ్ కుమార్ పెరియస్వామి కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధనుష్ – శ్రీలీల కలిసి నటించడం ఇదే తొలిసారి. కచ్చితంగా ఈ కాంబో కనువిందు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వుండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ లో ధనుష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయి అభ్యాంకర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: