మాల్దీవ్స్ ఈ పేరు వినగానే మన కళ్లముందు ఆకట్టుకునే నీలి సముద్రపు అందాలు, తెల్లటి ఇసుక తీరాలు, లగ్జరీ విల్లాలు,సూర్యాస్తమయపు సౌందర్యం కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకుల కలల గమ్యస్థానం మాల్దీవ్స్(Maldives). నిత్యం పనిలో మునిగి జీవితం ఉక్కిరిబిక్కిరి అయిన వారందరికీ ఒక మైండ్‌ఫ్రెష్ కోసం మాల్దీవ్స్ పర్యటన ఒక డ్రీమ్‌లా ఉంటుంది.మాల్దీవ్స్ అందాలను చూస్తే చాలు మనసు ఉల్లాసంతో నిండిపోతుంది. సముద్రపు కెరటాలు, తేమగా తాకే గాలులు, సూర్యరశ్మి కిరణాలు మానసికంగా ఎంతో రిలీఫ్ ఇస్తాయి. అందుకే మాల్దీవ్స్‌కు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు తరచూ విహారయాత్రలకు వెళ్తుంటారు. అందమైన ఫొటోల కోసం, హృద్యమైన అనుభూతుల కోసం ఈ ద్వీపదేశం ఆహ్వానం పలుకుతుంది.
పర్యాటక శాఖ
ఈ నేపథ్యంలో మాల్దీవ్స్‌ను ప్రపంచానికి మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. తన సౌందర్యం, స్టైల్, యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కత్రినా కైఫ్(Katrina Kaif) ఇప్పుడు మాల్దీవ్స్ పర్యాటక శాఖ తరఫున ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్ చేయనుంది.మాల్దీవులను ప్రముఖ పర్యాటక గమ్యంగా పరిచయం చేయడంలో భాగంగా కత్రినాని అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు మాల్దీవుల టూరిజం ప్రమోషన్ సంస్థ అయిన మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC) తాజాగా ప్రకటించింది.ఆమె మాల్దీవ్స్ అందాలను మరింతగా ప్రచారం చేయనున్నారు.
అత్యుత్తమ
మాల్దీవులు అనేవి సహజసిద్ధమైన అందం, ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులని పెంచేందుకు, వారికి అత్యుత్తమ అనుభవాలను అందించేందుకు నా వంతు కృషి చేస్తానని కత్రినా స్పష్టం చేశారు. మరోవైపు, మాల్దీవ్స్ రాజకీయంగా కూడా భారత్ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముఇజ్జు(Mohammed Muizzu) ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై నెలలో మాల్దీవులకు వెళ్లే అవకాశముందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.
మాల్దీవులను
కత్రినా కైఫ్ గ్లోబల్ అంబాసడర్‌గా, మరోవైపు ప్రధాని మోదీ పర్యటన ఈ రెండు సంఘటనలూ మాల్దీవులను ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బలోపేతం చేయడం ఖాయం అని నెటిజన్స్ అంటున్నారు. కాగా, ఆ మధ్య ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత భారతీయులంతా మాల్దీవులను బహిష్కరించారు. ఈ క్రమంలో భారతీయులని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అందుకే కత్రినాని అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
అన్వేషణ
మునుపటికంటే ఇప్పుడు ప్రజలు ప్రయాణాల విషయంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశాలను ఎక్కువగా అన్వేషణ చేస్తున్నారు. కొత్త ప్రదేశాలు చూసేందుకు, ప్రశాంతత కోసం, ప్రకృతిని ఆస్వాదించేందుకు మంచి గమ్యస్థానాల కోసం వెతుకుతారు. అలాంటి వారికి మాల్దీవ్స్ ఒక హైలైట్‌డ్ డెస్టినేషన్(Highlighted destination)గా మారుతుంది. ఇప్పుడు కత్రినా కైఫ్ ప్రచారకర్తగా వ్యవహరించడం వల్ల మాల్దీవ్స్‌కు పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే, మాల్దీవ్స్‌కి కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్ కావడం వల్ల ఆ దేశ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి లభించనుంది. భవిష్యత్తులో మరిన్ని బోలెడన్ని పర్యాటకులు ఈ ద్వీప సుందరిని సందర్శించబోతున్నారు.
Read Also: DD Next Level Movie: ఓటీటీలోకి డీడీ నెక్ట్స్ లెవెల్ ఎప్పుడంటే?