हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

అదరగొడుతున్న కన్నప్ప సాంగ్

Sharanya
అదరగొడుతున్న కన్నప్ప సాంగ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా నుంచి వచ్చిన ‘శివా శివా శంకరా’ అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట శివభక్తిని ఉట్టిపడేలా రూపొందించడంతోపాటు సంగీత ప్రియులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. మహా శివరాత్రి సమీపిస్తుండటంతో ఈ పాట మరింత వైరల్ అవుతోంది.

et00377025 emakdlcbvx landscape

80 మిలియన్ల వ్యూస్, రికార్డు స్థాయి రీల్స్

ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటివరకు 80 మిలియన్ల (8 కోట్ల)కి పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షలకు పైగా రీల్స్ ఈ పాటతో రూపొందించబడ్డాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటకు మంత్ర ముగ్ధులై, రీల్స్ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

పాటకు ఉన్న విశేషతలు

భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ పాట శివనామస్మరణతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. సంగీతం, పాట సాహిత్యం శివుడి మహత్యాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
కన్నప్ప పాత్ర కోసం మంచు విష్ణు ఎంతో శ్రద్ధ పెట్టి నటించగా, ఈ పాట విజువల్‌గా కూడా అందరిని ఆకట్టుకుంటోంది.

మంచు విష్ణు స్పందన

ఈ పాట సాధించిన ఘన విజయం గురించి మంచు విష్ణు మాట్లాడుతూ
శివా శివా శంకరా పాటకు ప్రేక్షకుల నుండి వస్తున్న అపూర్వ స్పందన మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులు దీనిని రీల్స్ రూపంలో పంచుకుంటూ తమ అనుభూతిని వ్యక్తపరుస్తుండటం ఆనందంగా ఉంది. ఇది అంతలా ట్రెండ్ అవుతుందని ఊహించలేదు. మహా శివరాత్రి నేపథ్యంలో ఈ పాట మరింతగా జనాదరణ పొందుతుందని మేము భావిస్తున్నాం, అని తెలిపారు.

కన్నప్పలో ప్రభాస్ & అక్షయ్ కుమార్

‘కన్నప్ప’ చిత్రంలో ప్రధాన పాత్రలో మంచు విష్ణు కనిపించనుండగా,ప్రభాస్ రుద్రునిగా,
అక్షయ్ కుమార్ మహాశివుడిగా,మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మహా శివరాత్రికి ఈ పాట మరింత ట్రెండ్

ఈ పాట ఇప్పటికే శివభక్తుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. మహా శివరాత్రి సందర్భంగా శివుడి భక్తి గీతంగా మారిపోతోంది. దేవాలయాలు, సోషల్ మీడియా, వీధి వీధుల్లో ‘శివా శివా శంకరా’ పాట మార్మోగే అవకాశం ఉంది. మహా శివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ, శివుడిని ఆరాధిస్తారు. ఈసారి ప్రత్యేకంగా ‘శివా శివా శంకరా’ పాట శివార్చనలో భాగంగా మారిపోతోంది. దేవాలయాల్లో, పరమశివుడి ఆలయ ప్రాంగణాల్లో, శివ భక్తుల గృహాల్లో ఈ పాట ప్రతిధ్వనించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870