
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ‘డ్రాగన్’ (టైటిల్) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే KGF, సలార్ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌లు అందించిన నీల్, ఈ సారి ఎన్టీఆర్‌తో కలసి బాక్సాఫీస్‌పై మరింత దుమ్మురేపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కాంబినేషన్ గురించి తెలిసినప్పటి నుండి అభిమానుల్లో ఆసక్తి గరిష్ట స్థాయికి చేరింది.
RRRతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీఆర్‌కి, ప్రశాంత్ నీల్‌కి ఈ ప్రాజెక్ట్ మరో మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమలో చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, శారీరకంగా, మానసికంగా కొత్త అవతారాన్ని సృష్టిస్తున్నారు. ‘డ్రాగన్’ (dragon’) లో యంగ్ టైగర్ ఇప్పటివరకు కనిపించని విధంగా, మరింత స్లిమ్, ఫిట్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం.
క్యారక్టర్ కోసం ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు
గతంలో కంటే చాలా స్లిమ్ గా, లీన్ లుక్‌లో కనిపించనున్నారు. దీని కోసం ఆయన హార్డ్ వర్కౌట్స్ చేస్తున్నారు. తాజాగా తారక్ జిమ్‌లో చెమటలు కక్కిస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఆయన షర్ట్ లేకుండా కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీ (Six pack body) ని ప్రదర్శిస్తూ, యాబ్స్ చూపిస్తున్నారు. క్యారక్టర్ కోసం ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. డ్రాగన్ బీస్ట్ మోడ్ ఆన్ అయిందని, ఆయన బాడీ బాక్సాఫీస్ అని కామెంట్స్ చేస్తున్నారు.
హై ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ‘ఎన్టీఆర్ నీల్’ సినిమా రెడీ అవుతోంది. 1961 గోల్డెన్ ట్రయాంగిల్, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ సెట్ చేయబడిందనే టాక్ ఉంది. ప్రశాంత్ నీల్ (Prashant Neel) గత చిత్రాల మాదిరిగానే గ్రే థీమ్ తో భారీ సెటప్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తారక్ ఇంతకముందెన్నడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం నిరంతరం వ్యాయామాలు చేస్తూ, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ తనని తాను మార్చుకుంటున్నారు. తారక్ జిమ్ లో హెవీ వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇరు దేశాల మధ్య భాగస్వామ్య శక్తిని
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మంగళవారం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లారు. కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ (General Laura Williams) తో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌లో పంచుకున్నారు. ”కాన్సులేట్‌కు తారక్‌ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది! అమెరికాలో చిత్రీకరించబడనున్న అతని ఇటీవలి సినిమాలు,
రాబోయే ప్రాజెక్టులు భారతదేశం & యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటుగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య శక్తిని, ఉద్యోగాలను సృష్టించడానికి ఉపయోగపడతాయి” అని లారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. దీనికి తారక్ స్పందిస్తూ ఆమెను కలవడం ఎంతో ఆనందంగా ఉంది,అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: