हिन्दी | Epaper

Jr. NTR: ‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

Saritha
Jr. NTR: ‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

Jr. NTR: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2026 జూన్‌లో గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఊహించని కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: Bhartha Mahashayulaku Vignapthi: ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

Jr. NTR: 'డ్రాగన్' సినిమా విడుదల వాయిదా?
Jr. NTR ‘Dragon’ movie release postponed?

సినిమా ఆలస్యానికి ప్రధాన కారణం మధ్య ప్రాచ్యం (Middle East) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. కథా పరంగా జోర్డాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే అక్కడ యుద్ధ వాతావరణం, భద్రతా కారణాల వల్ల ఆ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా చిత్ర యూనిట్ రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భద్రతా కారణాల వల్ల ఆగిపోయాయి. ప్రత్యామ్నాయ లొకేషన్ల కోసం మేకర్స్ పరిశీలిస్తున్నారని, దీనివల్ల సినిమా విడుదల ఆలస్యం కావచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870