हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Jagapathi Babu: డబ్బు పెద్ద జబ్బు.. దాని వెంట పడొద్దు

Aanusha
Jagapathi Babu: డబ్బు పెద్ద జబ్బు.. దాని వెంట పడొద్దు

సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu), ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన డబ్బు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు వెంట పరిగెత్తడం కాదని, అది మన దగ్గరికి వచ్చేలా ఉండాలన్నారు. డబ్బు కేవలం అవసరాలను తీర్చే సాధనమని, మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇవ్వడం ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నా, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని, ఆస్తుల కంటే ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా పలకరించే మనుషులే నిజమైన సంపద అని తెలిపారు.

Read Also: ‘Chikiri Chikiri’ Song: బ్యాట్‌ స్టెప్‌ ఐడియా రామ్‌చరణ్‌దే: జానీ మాస్టర్

డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బు

డబ్బు కోసం అబద్ధాలు, వేషాలు వేయడం కంటే ఉన్నదానితో తృప్తిగా బతకడమే మేలని జగపతి బాబు సందేశమిచ్చారు. డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బు అని, దాని కోసం ప్రాణ స్నేహితులను, బంధువులను దూరం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తాను వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా పలకరించే మనుషులు ఉండటమే నిజమైన ఆస్తి అని తెలిపారు.

తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ఆ తర్వాత స్టైలిష్ విలన్‌గా మారి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాజగపతిబాబు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 1990వ దశకంలో రొమాంటిక్, ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. మధ్య తరగతి భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించే నటుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు.

Jagapathi Babu: Money is a big disease.. don't fall for it
Jagapathi Babu: Money is a big disease.. don’t fall for it

‘లెజెండ్’ చిత్రం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌

అయితే హీరోగా కెరీర్ ముగిసే క్రమంలో వరుస పరాజయాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన విలన్ పాత్రల ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ‘లెజెండ్’ చిత్రం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తరువాత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, బలమైన క్యారెక్టర్ రోల్స్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

జగపతిబాబు ప్రస్తుతం అనేక భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ చిత్రంలో ఆయన అప్పలసూరి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పూర్తిగా భిన్నమైన లుక్‌లో, ప్రేక్షకులు గుర్తుపట్టలేని విధంగా ఉండబోతున్నారని ఫస్ట్ లుక్‌ని బట్టి తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రతి పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుంటున్న జగపతిబాబు ‘పెద్ది’ సినిమాతో మరోసారి తన నటన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870