ఈ జనరేషన్ లో సహజ నటి ఎవరు అనే ప్రశ్న వస్తే వెంటనే సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. మేకప్ వేసుకోకపోయినా, సింపుల్ లుక్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. గ్లామర్ ఫీల్డ్ లో పోటీని తట్టుకుని నేచురల్ బ్యూటీతో ఈ స్థాయికి రావడం అందరికి సాధ్యం కాదు. అందుకే సాయి పల్లవికి భారీ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది.ఆమె సహజమైన నటన వల్లనే సాయి పల్లవి సినిమాలను ప్రేక్షకులకు ఇష్టపడుతున్నారు.ఇటీవల సాయి పల్లవి ‘తండేల్’ సినిమా ద్వారా మరో బిగ్ హిట్ అందుకుంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత సాయి పల్లవికి మరిన్ని క్రేజీ ఆఫర్లు అందుకుంది.ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుండగా రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరిలో సాయి పల్లవి ప్రత్యేకం. కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులను అలరిస్తుంది. అద్భుతమైన నటనతో ఫాలోయింగ్ పెంచుకుంది.
ప్రత్యేక కారణం
సాయి పల్లవి సినీ ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన నటి.ఆమె ఎప్పుడూ సంప్రదాయ దుస్తులకే ప్రాధాన్యం ఇస్తుంది.గ్లామర్ షో లేకుండానే తన అద్భుతమైన నటనతోనే ప్రేక్షకులను మెప్పిస్తోంది.అందుకే అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.సాయి పల్లవి సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.గతంలో ఆమె టాంగో డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయ్యింది.అందులో ఆమె పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేసింది.ఈ వీడియో చూసి కొంతమంది విమర్శలు చేశారు. గతంలో తాను టాంగో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యిందని.అందులో తాను పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేయడంపై విమర్శలు వచ్చాయని తెలిపింది.మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది సాయి పల్లవి. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా సంచలన విజయం సాధించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

లవ్ స్టోరీ
నిజానికి, మేకప్ లేకుండా సినిమాల్లో నటించడానికి ఇష్టపడే ఏకైక నటి ఆమె. మేకప్ లేకుండా కూడా ఆమె చాలా అందంగా కనిపిస్తుంది.సాయి పల్లవి తాజాగా ‘తండేల్’లో ప్యూర్ లవ్ స్టోరీని ఆడియెన్స్ కు చూపించిన విషయం తెలిసిందే. గతంలో ‘విరాటపర్వం’తో రెబలిస్ట్ గానూ మెరిసి ఆకట్టుకుంది.ఇక రెండోసారి అక్కినేని నాగచైతన్యతో కలిసి బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఓవైపు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.