RGV-Aditya Dhar: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసిన తర్వాత వర్మ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిత్య ధర్ సినిమా తీసే విధానం, కథను నడిపించే తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, తాను ఆయనకు పెద్ద అభిమానిని అయిపోయానని వర్మ చెప్పుకొచ్చారు.
Read Also: Sun TV Network-CSK: సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా
ఆదిత్య ధర్ మేకింగ్‌కు వర్మ ఫిదా
ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తుతూనే, చిత్ర పరిశ్రమలో ఆయన ఎదుర్కొంటున్న అసూయను వర్మ బయటపెట్టారు. ఆదిత్య ధర్, ఆయన భార్య, నటి యామీ గౌతమ్‌ల పతనం కోసం పరిశ్రమ మొత్తం వేచి చూస్తోందని వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.ఆదిత్య ధర్ సినిమా మేకింగ్‌లో సరికొత్త పద్ధతులను, కథ చెప్పే తీరులో కొత్త గ్రామర్‌ను ప్రవేశపెట్టారని వర్మ కొనియాడారు.
/movietalkies/media/media_files/2026/03/14/ram-gopal-varma-aditya-dhar-yami-gautam-dhar-1-2026-03-14-11-07-25.jpg)
ఆయన ప్రభావం ఎంతలా ఉందంటే, టాలీవుడ్‌లో రాబోయే పలు భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు ‘ధురంధర్’ మేకింగ్ స్టైల్‌ను చూసి తమ షూటింగ్‌లను ఆపేసి మరీ రీ-షూటింగ్ చేసుకుంటున్నాయని వెల్లడించారు. దీనివల్ల నిర్మాతల పై బడ్జెట్ భారం పడుతోందని, అందుకే పరిశ్రమకు ఆయనపై కోపం, అసూయ పెరిగిపోయాయని వర్మ విశ్లేషించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వర్మను విమర్శిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: