हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Actor: నేను ఎప్పుడు న‌ట‌న నుండి వైదొలుగుతానో తెలియ‌దు : అజిత్

Anusha
Actor: నేను ఎప్పుడు న‌ట‌న నుండి వైదొలుగుతానో తెలియ‌దు : అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఇటీవ‌ల అజిత్ సినిమాల కన్నా కూడా మోటార్ రేసింగ్ పై ఎక్కువ‌గా దృష్టి సారించాడు. మోట‌ర్ రేసింగ్‌లో త‌ల ఎన్నిసార్లు గాయ‌ప‌డ్డా కూడా దానిని వీడడం లేదు. అయితే తాజాగా ఆయ‌న ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ నేను ఎప్పుడు న‌ట‌న నుండి వైదొలుగుతానో తెలియ‌దు.బ‌లవంతంగా వీడాల్సి రావ‌చ్చు. నేను ఏ విష‌యాన్నైన కూడా తేలిక‌గా తీసుకోకూడ‌దు అనుకుంటున్నా.ప్రేక్ష‌కులు నా న‌ట‌న గురించి ఫిర్యాదు చేస్తారేమో, అప్పుడు వైదొల‌గ‌క త‌ప్ప‌దు. ఒక‌వేళ న‌న్ను అంతా ఆద‌రిస్తున్న‌ప్పుడే త‌ప్పుకుంటానేమో. జీవితం చాలా విలువైన‌ది. నేను నా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా స్నేహితులు క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నారు. అలాంటి వారిని చూసిన‌ప్పుడు జీవితం విలువ ఏంటో అర్ధ‌మ‌వుతుంది. స‌మ‌యాన్ని వృధా చేయ‌కుండా నా లైఫ్‌లోని ప్ర‌తిక్ష‌ణాన్ని ఆస్వాదించాల‌ని అనుకుంటున్నా అని అజిత్ అన్నారు. తాను యాక్సిడెంట‌ల్ స్టార్ అని అన్నాడు. రంగుల‌ ప్రపంచంలో భాగం కావాలని తాను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని అనుకోకుండా న‌టుడ‌య్యానంటూ అజిత్ అన్నారు.

 Actor: ప్రేక్ష‌కులు నా న‌ట‌న గురించి ఫిర్యాదు చేస్తారేమో : అజిత్

విమర్శలు

యాక్టింగ్ పై ఎప్పుడు దృష్టి పెట్ట‌లేదు. యాక్సిడెంట‌ల్ స్టార్‌ని నేను. స్కూల్ చ‌దువుల తర్వాత ఆటోమొబైల్ రంగంలో పని చేసాను` అని అజిత్ తెలిపారు. 18 ఏళ్లు ఉన్నపుడు రేసింగ్ స్టార్ట్ చేశాను. రేసింగ్ ఖర్చుతో కూడుకున్న పని అవ్వటంతో మా అమ్మానాన్నలు ఆర్థికంగా నాకు అంత‌గా స‌పోర్ట్ చేయ‌లేక‌పోయారు. అయిన నేను వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఓ రోజు నేను రేస్ ట్రాకులో ఉండగా మోడల్ కోఆర్డినేటర్ నా దగ్గరకు వచ్చి మోడలింగ్‌లో ఆసక్తి ఉంటే తనను కలవమని ఓ కార్డ్ ఇచ్చి వెళ్లాడు. రేసింగ్ కోసం డబ్బులు వస్తాయి కాబట్టి ఓకే చెప్పాను. మోడలింగ్‌లో వచ్చిన డబ్బుల్ని రేసింగ్‌ కోసం వాడేవాడిని. ఓ సారి తెలుగు సినిమా ఆడిషన్‌కు కాల్ రాగా, నాకు తెలుగు రాదు కాబ‌ట్టి నేర్చుకున్నా.మా కుటుంబానికి సినిమాలతో అస్సలు సంబంధం లేదు కాబట్టి వారు భయపడ్డారు. వారికి న‌చ్చ‌జెప్పి సినిమాల్లోకి వెళ్లా. వ్యాపారంలో బాగా దెబ్బతినటం వల్ల నేను సినిమాల్లోకి వచ్చాను.నా యాస కారణంగా కూడా చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. పట్టుదలతో అన్నిటిపై పట్టు సాధించాను. సినిమాల విషయంలో ఎంతో నిజాయితీగా ఉన్నాను అంటూ అజిత్ పేర్కొన్నారు.

Read Also: Movie: ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870