हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

HIT 3 Movie: HIT 3 లో అందరిని ఆకట్టుకున్న కోమలీ ప్రసాద్

Sharanya
HIT 3 Movie: HIT 3 లో అందరిని ఆకట్టుకున్న కోమలీ ప్రసాద్

న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. వరుసగా హిట్ అవుతున్న హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడో చిత్రం. ఇందులో నాని పోలీస్ అధికారిగా ధీటుగా కనిపించగా, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలో ప్రేక్షకుల మనసులను దోచిన పాత్రల్లో ఒకటి కోమలీ ప్రసాద్ పోషించిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర.

డాక్టర్ నుంచి నటిగా

తెలుగు సినీరంగంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు కొందరు హీరోహీరోయిన్స్ వైద్యులుగా వర్క్ చేశారు. మరికొందరు నటనపై ఆసక్తితో డాక్టర్ చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లో కొనసాగుతున్నారు. శ్రీలీల, సాయి పల్లవి, కామాక్షి భాస్కర్ల, మీనాక్షి చౌదరి వంటి స్టార్స్ డాక్టర్స్. కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులర్ అవుతుంది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. ఆమె మరెవరో కాదు కోమలీ ప్రసాద్.

పోలీస్ పాత్రల్లో స్పెషలిస్ట్

హిట్ 2లోనే ఆమె పోలీస్ పాత్రలో ఆకట్టుకుంది. ఇప్పుడు హిట్ 3 లోనూ అదే స్థాయిలో, మరింత పటిష్ఠంగా తన పాత్రను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న కోమలీ ప్రసాద్ తన గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ “నేను డెంటిస్ట్ ను డాక్టర్ చదువు పూర్తి చేసి డెంటిస్ట్ గా పనిచేశాను. సినిమాల్లోకి వస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నాకే ఏదైనా చేయమన్నారు. చేతిలో డిగ్రీ ఉంటే సేఫ్గా ఉంటుంది అని చెప్పారు. అందుకే ఇండస్ట్రీలోకి లేట్ గా వచ్చాను.

క్లాసికల్ డ్యాన్సర్ కోమలీ

న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ చదవాలనే ఆలోచనలో ఉన్న సమయంలో, ఆమెకు “సీత దేవి” అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకు దర్శకుడు స్వయంగా హీరోగా నటిస్తున్నాడు. అతని ఆహ్వానం మేరకు ఆమె తన మాస్టర్స్ అప్లికేషన్‌ను చింపేసి, పూర్తిగా సినిమాల వైపు అడుగుపెట్టింది. కోమలీ చెప్పిన ఈ విషయాలు ఆమెకు నటనపై ఉన్న అభిమానం ఎంతగా ఉందో స్పష్టం చేస్తాయి. తెలుగులో నెపోలియన్, హిట్, టచ్ మీ నాట్, లూజర్ వంటి చిత్రాల్లో నటించింది.

Read also: Samantha : దర్శకుడు రాజ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870