‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా విశేషాలు
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Paapi Reddy). డా.సంధ్య గోలి సమర్పణలో వెను సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మురళీ మనోహర్ (Murali Manohar) దర్శకత్వం వహించాడు. ఇది హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
నటీనటులు & సాంకేతిక నిపుణులు
Gurram Paapi Reddy: దశాబ్ద కాలంగా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారిని అలరిస్తోన్న టాప్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఆరంగేట్రం చేస్తుండడం విశేషం. ఇంకా బ్రహ్మానందం, జీవన్ కుమార్, మొట్టై రాజేంద్రన్, ప్రభాస్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
టీజర్ విడుదల & స్పందన
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు. టీజర్‌ను చూస్తే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వించడమే పనిగా పెట్టుకున్నట్లు ప్రతీ సీన్‌లో నవ్వులు పూయించేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మధ్యలో వచ్చే పంచులు, సింగిల్ లైనర్స్ అదిరి పోయాయి. సినిమాపై అంచనాలు కలిగేలా చేసింది. అంతేగాక మంచి విజయం ఖాయమనేలా చేసింది.
‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా ఏ తరహా చిత్రమై ఉంటుంది?
ఇది హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసిన ఔట్ అండ్ ఔట్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమా.
‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ గురించి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?
టీజర్‌లో నవ్వులు పూయించే సన్నివేశాలు, పంచులు ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి అంచనాలు తెచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: