ప్రియమణి ప్రధాన పాత్రలో ‘గుడ్ వైఫ్’: లాయర్ రోల్‌లో ఆసక్తికరమైన మలుపులు
good wife: విశేషమైన కథా నిర్మాణాలు, బలమైన పాత్రలు, సామాజిక స్పర్శ ఉన్న కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతూనే ఉంది.
అలాంటి పంథాలోనే మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘good wife’.
ఈ సిరీస్‌లో ప్రముఖ నటి ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె ఓటీటీ లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండగా, మరోవైపు వెబ్ కంటెంట్‌లో కూడా కీలకమైన పాత్రలు చేస్తూ తన మార్క్ చూపిస్తున్నారు.
తెలుగులో వచ్చిన ‘భామ కలాపం’ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియమణి, హిందీలో ప్రసారమైన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ తో నేషనల్ లెవెల్‌లో గుర్తింపు పొందారు.
అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు ‘గుడ్ వైఫ్’ ద్వారా మరోమారు లాయర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ పొందుతోంది.
అమెరికన్ షోకు రీమేక్ – పాన్ ఇండియా విడుదల
‘గుడ్ వైఫ్’ సిరీస్ అసలు రూపం అమెరికన్ టీవీ షో ‘ది గుడ్ వైఫ్’ ఆధారంగా రూపొందించబడింది. అమెరికాలో మంచి విజయాన్ని అందుకున్న ఈ డ్రామా సిరీస్‌ను ఇప్పుడు భారతీయ అభిరుచికి అనుగుణంగా మలిచారు.
ప్రస్తుతానికి తమిళంలో చిత్రీకరించిన ఈ సిరీస్‌ను త్వరలోనే తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇది ఒకరకంగా పాన్ ఇండియా ఓటీటీ సిరీస్ గా నిలవనుంది. కథలో నాటకీయత, ఎమోషనల్ డెప్త్ ఉండటంతో, భిన్న భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.
పట్టుబట్టల లాయర్‌గా ప్రియమణి – ఇంటి బాధ్యతలతో కోర్టు న్యాయం మధ్య తేడా
కథ విషయానికి వస్తే .. ప్రియమణి ఈ సిరీస్ లాయర్ పాత్రలో కనిపించనుంది. మాజీ లాయర్ ఉన్న ఆమె, భర్త .. ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటుంది.
అయితే ఊహించని విధంగా ఆమె భర్త సెక్స్ స్కాండల్ చిక్కుకుంటాడు. సమాజం అంతా ఆ కుటుంబం వైపు చూస్తూ ఉంటుంది.
తన భర్త నిర్దోషి అని నిరూపించడం కోసం ఆమె లాయర్ గా మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే మలుపులే మిగతా కథ.
ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొనే పెద్ద పెద్ద సవాళ్లు, పరువు పోరు, పారివారిక బాధ్యతలు అన్నీ కథకు బలాన్ని ఇచ్చే అంశాలుగా మారతాయి.
ఈ సిరీస్‌లో ప్రేమ, న్యాయం, బాధ్యత, సంఘటనలపై స్పందన వంటి అంశాలు బలంగా నడుస్తాయి. ఈ పాత్రకు ప్రియమణి నటన పూర్తి న్యాయం చేస్తుందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
తారాగణం, టెక్నికల్ టీం కూడా హైలైట్
ఈ సిరీస్‌లో ప్రియమణితో పాటు సీనియర్ నటి రేవతి, సంపత్ రాజ్, ఆరి అర్జునన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వారి నటన కూడా కథకు బలాన్నిచ్చే విధంగా ఉండనుంది. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్, క్లాస్ మేకింగ్‌తో ఈ సిరీస్ ఓటీటీ లో మరో మెరుగైన క్రిమినల్ డ్రామాగా నిలవబోతోంది.
కోర్ట్ డ్రామాల నేపథ్యం కావడం వల్ల డైలాగ్స్‌కి, సన్నివేశాలకి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. వాటికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Read also: Padachakkalam: సూపర్ హిట్ కొట్టిన ‘పదక్కలం’.. భారీ ఆదాయం