సినిమా వేదికపై ప్రయోగాత్మక చిత్రాలకు పట్టం కట్టే సమయం ఇది. దాసరి ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో సంచలనం సృష్టించింది ‘శబరి’ చిత్రం. వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన శైలిలో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రేక్షకులను కట్టిపడేసే కథాంశంతో ఉత్తమ కథా చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.అమెరికాలో స్థిరపడిన నిర్మాత మహేంద్ర నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, విడుదలైన నాటి నుండి ‘శబరి’ తన విభిన్నమైన కథతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన దాసరి ఫిలిం అవార్డుల్లో ఉత్తమ కథా చిత్రంగా నిలవడం ఈ సినిమా విజయానికి మరింత బలం చేకూర్చింది. కథకు ప్రాధాన్యమిచ్చే చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది.దివంగత దర్శకులు దాసరి నారాయణ రావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈసారి ‘శబరి’ ఉత్తమ కథా చిత్రంగా నిలవడం నిజంగా అభినందించదగ్గ విషయం. వరలక్ష్మి నటన, కథలోని మలుపులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయని ఈ అవార్డు నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన కథా చిత్రాలు రావడానికి ‘శబరి’ విజయం స్ఫూర్తినిస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.
కథ ఏంటంటే
సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) తన తల్లిదండ్రులను ఎదురించి అరవింద్ (గణేష్ వెంట్రామన్)ను వివాహం చేసుకొంటుంది. వారిద్దరికి రియా (బేబీ నివేక్ష) పుట్టిన తర్వాత విడిపోతారు. అయితే రియాను,సంజనను చంపడానికి సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తుంటాడు. అయితే భర్త అరవింద్ నుంచి విడిపోయిన తర్వాత తన పాపను రక్షించుకోవడానికి తన స్నేహితుడు లాయర్ రాహుల్ (శశాంక్) సహాయం తీసుకొంటుంది.ప్రేమించి పెళ్లి చేసుకొన్న అరవింద్ నుంచి సంజన ఎందుకు విడిపోయింది? కూతురు విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగింది? సంజనను సూర్య ఎందుకు టార్గెట్ చేస్తాడు? సంజనకు ఉన్న మెంటల్ డిజార్డర్ ఏమిటి? తనకు ఉన్న మానసిక లోపం వల్ల ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టాయి? సూర్య నుంచి రియాను, తనను ఎలా కాపాడుకొన్నది? అరవింద్‌తో బంధానికి ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే శబరి సినిమా కథ.

దర్శకుడు అనిల్ కాట్జ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథలో రకరకాల లోపాలు, ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని సమస్యలు ఉండటం వల్ల మొదటి భాగం కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు 15 నిమిషాల ముందు ఓ ట్విస్టుతో కథ మరో జోన్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమింట్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి. అయితే కథను డిఫరెంట్‌గా చెప్పడానికి స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదనే స్పష్టంగా కనిపిస్తుంది.ఇక యాంగ్రీ యంగ్ ఉమెన్ పాత్రలతో ఆకట్టుకొంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్ తనకు ఉన్న ఇమేజ్ నుంచి పక్కకు వచ్చి పూర్తిగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాను చేసిందనే చెప్పాలి. సినిమా భారాన్ని మొత్తంగా తన భుజాలపై నడిపించగల సత్తా ఉందని ఈ సినిమాతో ఆమె చెప్పకనే చెప్పింది. శబరి అంటే మాతృత్వం అలాంటి మంచి భావన ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. కథలో వేరియేషన్స్ లేకపోవడం వల్ల తన పాత్ర పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేసింది.