
Dhurandhar 2 Telugu Trailer: గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ‘హంజా’, ‘జస్కిరత్ సింగ్ రంగీ’ అనే రెండు విభిన్నమైన, పవర్‌ఫుల్ లుక్స్‌లో కనిపిస్తూ తన నటనతో అదరగొట్టారు. ఆదిత్య ధర్ విజన్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్
పాకిస్థాన్ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది.. డైలాగ్స్ వైరల్!
ఈ ట్రైలర్‌లో “పాకిస్థాన్ భవిష్యత్తును ఇప్పుడు ఇండియా నిర్ణయిస్తుంది” వంటి డైలాగులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తుండగా, సంజయ్ దత్ చెప్పిన సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.ఈ చిత్రం మార్చి 19, 2026న తెలుగు, హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. దాదాపు 3 గంటల 55 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సినిమా కోసం మార్చి 18 సాయంత్రం 5 గంటల నుండే పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం కానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: