తమిళ్‌లో సూపర్ హిట్.. ఇప్పుడు తెలుగు ఓటీటీలో
తమిళనాట 2023 సెప్టెంబర్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన “డీమన్“ అనే హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు తెలుగులో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్‌లో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమా ఇప్పుడు “ఆహా” ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ హారర్ (Psychological horror) డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశాయి. తమిళ ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఈ సినిమా తెలుగులోనూ అదే ఉత్కంఠను రేపుతుందని భావిస్తున్నారు.

ఒంటరిగా ఓ బంగ్లాలో కథ రాయడానికి వెళ్లిన డైరెక్టర్.. అతడికి ఎదురైన భయంకర అనుభవం
ఈ సినిమాలో కథేంటంటే ఇందులో విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) అనే ఓ సినిమా డైరెక్టర్ సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉంటాడు. తాను తీయబోతున్న హారర్ మూవీ కోసం కథ రాసే ప్రణాళికల్లో ఉంటాడు. ఎలాంటి అడ్డంకులు, డిస్ట్రబెన్స్ లేకుండా సినిమాకథ రాసుకోవడానికి సిటీ శివారులో ఉన్న ఓ బంగళాకు షిప్ట్ అవుతాడు. అయితే ఆ బిల్డింగ్‌లో నిద్రపోయిన తర్వాత విఘ్నేష్ శివన్‌కు విచిత్రమైన కలలు వస్తుంటాయి. ఓ దయ్యం అతనిని చంపడానికి చూస్తుంది. మరి ఆ బిల్డింగ్‌లో దయ్యం ఉందా? విఘ్నేష్ ను చంపేందుకు ప్రయత్నించింది ఎవరు? ఆ బిల్డింగ్ మిస్టరీని విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) ఎలా ఛేదించాడు? విఘ్నేష్ డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నదే ఈ సినిమా కథ.
నటీనటుల ప్రదర్శన, టెక్నికల్ టీం పనితీరు హైలైట్
ఈ హారర థ్రిల్లర్ సినిమా పేరు డీమన్ (Demon). సచిన్ మణి, అబర్నతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. రమేష్ పళనీవేల్ దర్శకత్వం వహించాడు. మూవీ ఆద్యంతం హారర్ ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ను భయపెట్టాడు డైరెక్టర్. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. 2023 సెప్టెంబర్‌లో తమిళంలో ఈ సినిమా రిలీజైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనకునేవారికి డీమన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ ప్రియులకి డీమన్ ఓ బెస్ట్ ఆప్షన్
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న “డీమన్” ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆడియెన్స్ కోసం “ఆహా” వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. భయానికి కొత్త నిర్వచనంగా నిలిచే ఈ మూవీ సైకలాజికల్ హారర్ మూవీస్‌ను ఆస్వాదించే వారికి తప్పక చూడవలసిన సినిమా. థియేటర్లలో మిస్సయినవారు ఇప్పుడు ఇంటి వద్దే చూసేందుకు ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. థ్రిల్, సస్పెన్స్, భయం అన్నీ కలగలిపిన ఈ హారర్ డ్రామా ఓటీటీ వేదికపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
Read Also: Mass Jathara: ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ ‘మాస్ జాతర’
Read also: OG: ‘ఓజీ’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక ఆటంకం