Delhi HC- Ilayaraja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసలు విషయానికి వస్తే.. 1976 నుంచి 2001 వరకూ ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల హక్కులను నిర్మాతలు సరిగమకు శాశ్వత ప్రతిపాదికన విక్రయించారు. అయితే ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఆ సినిమా పాటలను ఉపయోగించుకోవచ్చు అని కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు అనుమతులు ఇచ్చారు. దీంతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ చర్యలు చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కంపెనీ వాదించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పాటలను వాడుకోవడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Tamil Nadu: హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు

పూర్తి హక్కులు సదరు సంస్థ సరిగమకే ఉంటాయి
30 రోజుల్లోగా లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలని ఇళయరాజాను ఆదేశించారు.నిర్మాత నుంచి కొనుగోలు చేసిన తర్వాత పూర్తి హక్కులు సదరు సంస్థ సరిగమకే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించకూడదని పేర్కొంది. గతేడాది విడుదలైన అగత్యా సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజాకు, సరిగమకు మధ్య వివాదం నెలకొంది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య వివాదం ముదురుతుంది. ఇప్పుడు ఆ సినిమా పాటలను ఇళయరాజా వాడుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు సినీరంగంలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: