हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Deepika Padukone: ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన దీపికా

Sharanya
Deepika Padukone: ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన దీపికా

రెబల్ స్టార్ ప్రభాస్ – సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘స్పిరిట్’ ప్రస్తుతం తెరముందుకు రాకముందే వార్తల్లో మారుమ్రోగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలు ఈ సినిమాకు ఊహించని పబ్లిసిటీ తెచ్చాయి. మొదట ఈ ప్రాజెక్ట్ హీరోయిన్గా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణెను (Deepika Padukone) తీసుకోవాలని సందీప్ రెడ్డి భావించారు. కథ వినిపించగానే దీపిక ఆసక్తి చూపినా, ఆపై ఆమె పెట్టిన రెమ్యునరేషన్ డిమాండ్లు, కొన్ని ఇతర షరతుల కారణంగా ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న దీపికా – అసలైన కారణం ఏమిటి?

ఈ వ్యవహారంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక స్పందిస్తూ, తాజాగా దీపిక ఓ ఇంట‌ర్వ్యూలో స్పిరిట్ నుంచి త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణమేంటో చెప్పారు. ఆమె మాట్లాడుతూ “ఇటీవ‌ల ఓ ద‌ర్శ‌కుడు న‌న్ను క‌లిసి స్టోరీ చెప్పారు. స్టోరీ చాలా బాగా న‌చ్చింది. కానీ, రెమ్యునరేషన్ గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్ప‌డు ఇంత చార్జ్ చేస్తా అని అన్నాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను వారికి నో చెప్పాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదు” అని దీపిక చెప్పుకొచ్చారు. దీపిక షరతులు ఎక్కువగా పెట్టడం, అంతేకాదు షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో అనుమతించలేని అభ్యంతరాలు వ్యక్తపరిచిన కారణంగా దర్శకుడు సందీప్ ఆమెను తొలగించారని సినీ వర్గాల వాదన.

దీపిక పీఆర్ టీం లీక్ వివాదం – వంగా ఫైర్

దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అంటూ ‘ఎక్స్’ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో గ‌త కొద్ది రోజులుగా దీపిక పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది.

ఇదిలాఉంటే, స్పిరిట్ నుంచి తప్పుకున్నా కానీ, దీపిక ఇప్పుడు మరో పెద్ద అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. దక్షిణ భారతం సూపర్‌స్టార్ అల్లు అర్జున్ – మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌లో దీపిక హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారని బాలీవుడ్ మ్యూజికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పుడు బ‌న్నీతో జ‌త‌క‌ట్ట‌నున్నారు.

Read also: Nagababu: గద్దర్ సినీ అవార్డులపై రేవంత్ రెడ్డికి నాగబాబు ధన్యవాదాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870