Cocktail 2 Release Date: రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టైల్-2’ (Cocktail 2) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జూన్ 19న భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘కాక్‌టైల్’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also: Anushka Shetty Marriage: త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?
షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో స్క్రీన్ షేరింగ్
ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు క్రేజీ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. రష్మిక ఇందులో ఆమె సరికొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. పెళ్లి తర్వాత రష్మిక నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ నెల 18న థియేటర్లలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: