మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘శశిరేఖ’ సాంగ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మెలోడీ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. (Chiranjeevi) ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. భీమ్స్ మరియు మధుప్రియ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకుర్చాడు. భాను మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
Read Also: Amaravati farmers plots: అమరావతి రైతులకు శుభవార్త
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: