Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రిపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. చిరంజీవి తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు బదులిస్తూ ఆమె పంచుకున్న ఈ సందేశం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.
Read Also: Pawan Kalyan: ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఫిక్స్

“డాడీ, థ్యాంక్యూ. రెండేళ్ల పాపగా మీ చేయి పట్టుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నేను, ఇప్పుడు మీ నిర్మాతగా మారడం నా జీవితనికి ఓ అద్భుతమైన వరం. నాకు ఒకే వ్యక్తిలో తండ్రి, గురువు, నిజ జీవిత హీరో, మెగాస్టార్.. అన్నీ మీరే. ఇంతకంటే నేనేం కోరుకోగలను? మీ విషెస్‌కి థ్యాంక్యూ. ఎప్పుడూ మీలాగే ఉన్నందుకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్వేస్” అంటూ సుస్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత, తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రిపై సుస్మిత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: