Mega Star Chiranjeevi : అభిమానుల ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపితమైంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే మహిళా అభిమాని చిరంజీవిని (Mega Star Chiranjeevi) కలిసేందుకు సైకిల్‌పై 300 కి.మీ ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్‌కి రాఖీ కట్టి మురిసిపోయారు. చిరంజీవి ఆప్యాయంగా పలకరించి ఆమెకు ఆర్థిక సహాయం చేసి చీరను బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె పిల్లల చదువుకు పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also :