ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. (‘Avatar: Fire and Ash’) దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే అవతార్ సిరీస్ గత భాగాలు సంచలనాలు సృష్టించాయి.‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు కూడా ఊపందుకున్నాయి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’లో పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Read Also: Prakash Raj: ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?
కొన్ని సూచనలు, హెచ్చరికలు చేశారు
సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతుండటంతో, జేమ్స్ కామెరూన్ (James Cameron) ఈసారి కేవలం ప్రమోషన్లకే పరిమితం కాకుండా థియేటర్ల నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా ఆయన థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేక లేఖ రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖలో జేమ్స్ కామెరూన్ చాలా స్పష్టంగా కొన్ని సూచనలు, హెచ్చరికలు చేశారు.
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ను ప్రేక్షకులకు అందించేందుకు తనతో పాటు తన టీమ్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు పంపిన DCPలో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయని, వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు. ముఖ్యంగా లైట్ లెవల్స్, సరైన ఫ్రేమింగ్,
ఆడియో కాన్ఫిగరేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.ఈ సినిమాను తానే వ్యక్తిగతంగా మిక్స్ చేశానని జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. నిశ్శబ్దమైన డైలాగ్ సన్నివేశాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ వరకు పూర్తి డైనమిక్స్ ప్రేక్షకులకు చేరాలంటే 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించవద్దని ఆయన చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: