బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, గాయని సులక్షణా పండిట్ (Sulakshana Pandit) ఇక లేరు. ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. 71 ఏళ్ల సులక్షణా పండిట్ ముంబైలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం ఆమె సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు లలిత్ పండిట్ (జతిన్-లలిత్ ద్వయం) అధికారికంగా ప్రకటించారు. “ఇవాళే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తాం” అని లలిత్ తెలిపారు.
Read Also: SSMB29 Update: ఈరోజు ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి
సులక్షణా పండిట్ (Sulakshana Pandit) కుటుంబం స్వతహాగా సంగీత వారసత్వం కలిగినది. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రముఖ సంగీత కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. సోదరులు ఉధయ్ పండిట్, జతిన్ పండిట్, లలిత్ పండిట్ – అందరూ సంగీత రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపిన సులక్షణా, తన సువర్ణ స్వరంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

‘సంకల్ప్’ సినిమాలో పాడిన పాటకు ఫిలింఫేర్ అవార్డు
1970లలో ఆమె గాత్రం ప్రతీ సంగీతప్రియుడి హృదయాన్ని తాకింది. తన మధురమైన స్వరంతో అనేక హిట్ పాటలను అందించారు. ‘సంకల్ప్’ సినిమాలో పాడిన పాటకు గాను ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ పాట ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆ తరువాత వరుసగా అనేక సినిమాలకు గాయనిగా సేవలందించారు. లతా మంగేష్కర్, ఆశా భోస్లే వంటి దిగ్గజ గాయకులతో కలిసి పాడి తన ప్రతిభను చాటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: