బిగ్ బాస్ సీజన్ 9.. (Bigg Boss 9) చివరి అంకానికి వచ్చింది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9)… ఈసారి విన్నర్ ఎవరు అవుతారనే విషయంపై విపరీతమైన బజ్ నెలకొంది. ముందు నుంచి తనూజ పేరు వినిపిస్తుండగా.. ఈమధ్య కాలంలో ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి.
Read Also: Bigg Boss 9: ఇమ్మానుయేల్ జర్నీ వీడియో ప్రోమో విడుదల
కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5గా నిలిచారు డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల. ఆట తీరు.. టాస్కులలో అదరగొట్టేస్తూ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తమ ప్రవర్తన, మాట తీరుతో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ సీరియల్ బ్యూటీ తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు టాప్ 4 కంటెస్టెంట్స్ తక్కువే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫినాలేకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.
దీంతో క్షణక్షణం ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి.అయితే, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో తనూజ మాత్రం ముందున్నారని చెప్పాలి. సీరియల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆమెకు మొదటినుంచే బలమైన ఓటింగ్ సపోర్ట్ ఉంది. ఈ కారణంగా గత కొన్ని వారాల వరకు ఆమె టైటిల్ రేస్‌లో టాప్‌లో కొనసాగింది. కానీ ఫినాలే సమీపిస్తున్న కొద్దీ ఓటింగ్ లెక్కలు క్షణక్షణం మారుతున్నాయి.

బుధవారం ఎపిసోడ్ లో ఇమ్మూ జర్నీ వీడియో
తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్ టైటిల్ కోసం తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ మధ్య గట్టి పోటీ నెలకొంది.ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ మధ్య ఓటింగ్ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. ఇటు తనూజ ఫ్యాన్స్, అటు కళ్యాణ్ ఫ్యాన్స్ ‘తగ్గేదేలే’ అన్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఓటింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇక నిన్నటి ఎపిసోడ్ తో ఓటింగ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి.
ముందు నుంచి టైటిల్ రేసులో సై అంటున్న తనూజ, కళ్యాణ్ ఇద్దరికీ పోటీగా దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. బుధవారం ఎపిసోడ్ లో ఇమ్మూ జర్నీ వీడియో వేరేలెవల్. మొదటి నుంచి తన ఆట తీరు, కామెడీతో అలరించిన ఇమ్మూ.. ప్రతి చోట తన మాట, ఆటతో కట్టిపడేశాడు. దీంతో ఇప్పుడు ఇమ్మూ ఓటింగ్ మారిపోయినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు కాబోతున్నారనేది ఉత్కంఠగా మారిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: