పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss 9) తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎప్పటిలానే ఈ సీజన్‌లో కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు రంగాల నుంచి సెలబ్రిటీలు, కొత్త ముఖాలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. విభిన్నమైన వ్యక్తిత్వాలు, వైవిధ్యమైన నేపథ్యాలతో హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ మొదటి వారం నుంచే ఆసక్తికరమైన టాస్కులు, వాదోపవాదాలతో హౌస్‌ను కిక్కిరిసేలా మార్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ అంటే గేమ్ రూల్స్ తప్పనిసరి. ఆ రూల్స్ ప్రకారం ప్రతి వారం నామినేషన్స్, ఎలిమినేషన్స్ (Nominations, eliminations) ఉంటాయి. మొదటి వారం నుంచే తొలగింపులు జరగడం ఈ సీజన్‌లో కూడా తప్పలేదు.
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నిలిచారు. వారిలో రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ తనూజ గౌడ (Tanuja Gowda) ను సేఫ్ జోన్‌లోకి పంపించాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరు హౌస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ శ్రష్టి వర్మ
వారాంతం ప్రత్యేక ఎపిసోడ్ అయిన ఆదివారం ఎలిమినేషన్ షోపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది. బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ శ్రష్టి వర్మ (Shrashti Verma) అని తెలుస్తోంది. మొదటి వారంలోనే బయటకు వెళ్లడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. షో ప్రారంభమైన కొద్దిరోజులకే హౌస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి రావడంతో శ్రష్టి వర్మ ప్రయాణం చాలా చిన్నదిగా మారిపోయింది.ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే శ్రష్టి వర్మ తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తుంది.

మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్‌మేట్స్‌తో సరిగ్గా మెలగడం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్‌లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్‌లో ఒక్క వారం మాత్రమే ఉండి బయటకు వచ్చిన శ్రష్టికి రెండు లక్షల రూపాయల మేరకు పారితోషికం లభించినట్టు తెలుస్తోంది. రోజుకు సుమారు రూ. 28,571 చొప్పున ఆమె రెమ్యునరేషన్ (Remuneration) తీసుకుందన్న వార్తలు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సీజన్ ప్రారంభమైనప్పటినుంచి మంచి హైప్
ఈ సీజన్ ప్రారంభమైనప్పటినుంచి మంచి హైప్ ఉంది. నాగార్జున (Nagarjuna) హోస్ట్‌గా బిగ్ బాస్ హౌస్ లో మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఊహించని విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందు ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది. కాని ఆమెకి కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: