ప్రముఖ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ‘ఎస్ఎస్ఎమ్ బి 29’. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె.ఎల్.నారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రం నుంచి ఇప్పుడు సూపర్ అప్డేట్ వచ్చింది.ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారని తెలుస్తోంది. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్‌ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించనున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ ఘట్టాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సాహసయాత్ర చేసే ఒక సాహసికుడి కథగా ఉండనుంది.
షూటింగ్
ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.ఒడిశా షెడ్యూల్‌లో మహేశ్ బాబుపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు రెండు వారాలు జరిగిన షూటింగ్ పూర్తైంది. ఇక అక్కి ప్రకృతి అందాలు తమని ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదొక స్వర్గసీమ అని మూవీటీమ్ అభివర్ణించింది. జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారం ఎప్పటికీ మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అధికారులకు థాంక్స్ నోట్ అందించారు.

ఆఫ్రికన్
ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించినప్పటి నుంచే, ‘ఎస్ఎస్ఎమ్ బి 29’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన ఏ చిన్న రూమర్ వినిపించినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉంటుందని రాజమౌళి ఇంకాస్త హైప్ ఎక్కించారు.ఈ సినిమాలో కాశీ పుణ్యక్షేత్రం విశిష్టత, చరిత్రకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయట.రియాలిటీకి దగ్గరగా ఉండేలా భారీ ఖర్చుతో కాశీ పట్టణానాన్ని రూపొందిస్తారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తారేమో చూడాలి.
Read Also:Shah Rukh Khan: జీవితంలో డబ్బు,స్టార్‌డమ్ కంటే ఒత్తిడి లేకుండా ఉండడమే ముఖ్యం: షారుక్ ఖాన్