బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా తన జీవితం, కెరీర్, స్టార్‌డమ్, డబ్బు వంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తన జీవితంలో జరిగి విషాద సంఘటన వలన తనకు డబ్బు, ఫేమ్ కంటే మానసికి ఒత్తిడి లేకుండా ఉండడమే లైఫ్‌లో ఉత్తమమని పంచుకున్నాడు షారుక్. త్వరలో కింగ్ సినిమాతో ప్రేక్షకు ల ముందుకు రాబోతున్న ఆయన తాజాగా ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకున్నాడు.నా తల్లిదండ్రుల మరణం నా సోదరిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ రోజు నా తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆమె ఏ మాత్రం ఏడవలేదు, ఇప్పటికీ ఆ సంఘటన నాకు గుర్తుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆమె ఆ మానసిక స్థితి నుంచి బయటపడలేకపోయింది. అందుకే నేను ఆమెలా డిప్రెషన్‌లో కూరుకుపోకుండా సినిమాల్లో నిమగ్నమై ఉంటాను. అందుకే జీవితంలో డబ్బు, కీర్తి కంటే ఒత్తిడి లేకుండా జీవించడమే నాకు ముఖ్యం అంటూ షారుక్ చెప్పుకోచ్చాడు.
కెరీర్ ప్రారంభం
ఇటీవల షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. కెరీర్ తొలినాళ్లలో టీవీ సీరియల్స్‌లో నటించిన షారుక్, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి రాణించారు. బాలీవుడ్ అగ్రకథానాయకుడిగా ఎదిగారు.సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో రోడ్డుపై పడుకున్నానని షారుక్ తెలిపారు. అద్దె కట్టేందుకు డబ్బులు లేక ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. సొంతింటిని కలిగి ఉండడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “నా పిల్లలు ఎప్పుడూ ఇల్లు లేకుండా ఉండకూడదనే భయం నాకు ఉంది. ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం మీ కాళ్ల వద్ద ఉన్నట్లే. మీకు ఉద్యోగం, డబ్బు లేకపోయినా ఫర్వాలేదు. కనీసం మీరు నిద్రించడానికి, అక్కడ కూర్చొని ఏడవానికి ఇల్లు ఉండాలి. కెరీర్ ప్రారంభంలో నేను రోడ్లపై పడుకున్నాను. అద్దె చెల్లించలేకపోవడం వల్ల నన్ను నా ఇంటి నుంచి బయటకు గెంటేసిన సందర్భాలు ఉన్నాయి” అని షారుక్ వ్యాఖ్యానించారు.

సొంత ఇల్లు
తనతో నటించే హీరోయిన్లను ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఇల్లు కొనుగోలు చేయమని చెబుతానని షారుక్ వివరించారు. “నేను యంగ్ హీరోయిన్లకు సొంత ఇల్లు కొనుక్కోమని చెబుతాను. వాళ్లు వచ్చి నిజంగా ఇల్లు కొనుక్కున్నామని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా ఇల్లు మన్నత్‌ను అభిమానులు ఎప్పటికీ గుర్తించుకుంటారు. ఈ ఇల్లు నా ఇతర విజయాలను తక్కువ చేసి చూపిస్తుంది. కానీ ఫర్వాలేదు. నేనేమి డబ్బు తినను. వెండి ప్లేట్లో ఆహారం తిన్నా రుచేమి పెరిగిపోదు. అందరూ తినే ఆహారమే తింటాను. అలాంటి బట్టలే ధరిస్తాను. నా దగ్గర నాలుగు జతల జీన్స్ ఉన్నాయి. ప్రజలు నా గురించి ఎంత భిన్నంగా ఆలోచించినా, నేను 20ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను.” అని షారుక్ తెలిపారు.
Read Also:Sampath Nandi: ఓదెల 2 మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న సంపత్ నంది