हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Anupama Parameswaran: మరోసారి శర్వానంద్ తో నటించనున్న అనుపమ

Anusha
Anupama Parameswaran: మరోసారి శర్వానంద్ తో నటించనున్న అనుపమ

టాలీవుడ్ హీరో శర్వానంద్ త‌న కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. సంప‌త్ నంది ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రాబోతుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మూవీ కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు శర్వానంద్. మే మొద‌టివారం నుంచి షూటింగ్ శ‌ర‌వేగంగా ప్రారంభంకాబోతుండ‌గా ఈ సినిమా కోసం హైదరాబాద్‌ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. ఇదిలావుంటే ఈ మూవీలో క‌థానాయిక‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ న‌టించ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టింది. గ‌తంలో శ‌ర్వానంద్, అనుప‌మ క‌లిసి శ‌త‌మానం భ‌వతి అనే సినిమాలో న‌టించారు. దిల్ రాజ్ నిర్మాణంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడి మ‌ళ్లీ జ‌త క‌డుతుండ‌డంతో భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌.ఎస్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌.

సంపత్ నంది

సంపత్ నంది కూడా ఓ హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. రీసెంట్‌గా సంపత్ నంది ఓదెల 2 అంటూ వచ్చాడు. కానీ అది ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆ చిత్రానికి మినిమం వసూళ్లు కూడా వచ్చినట్టుగా కనిపించడం లేదు. చివరగా ఆరు కోట్ల గ్రాస్ వచ్చిందంటూ ప్రకటించి సక్సెస్ మీట్ నిర్వహించినట్టున్నారు. కానీ ఓదెల 2 మాత్రం విపరీతమైన నష్టాల్ని తెచ్చినట్టుగా సమాచారం. ఈ మూవీ రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయిందని సంపత్ నంది అయితే గొప్పగా చెప్పుకున్నాడు.కానీ రియాల్టీలో మాత్రం ఓదెల 2 తీవ్ర నష్టాల్ని, కష్టాల్ని చూసిందని సమాచారం. బిజినెస్ అవ్వడానికి కూడా ఓదెల 2 అష్టకష్టాలు పడిందని అంటున్నారు. చివరకు ఏదోలా సినిమాను అయితే బయటకు తీసుకు వచ్చారు. ఆడియెన్స్‌ని అయినా ఓదెల 2 ఆకట్టుకుందా? అంటే అదీ లేదు. చివరకు అఖండ, అరుంధతి ఇలా అన్ని సినిమాల్ని కలిపి తీశారంటూ ట్రోలింగ్ చేశారు. అలా సంపత్ నందికి మళ్లీ ఓ ఫ్లాప్ పడ్డట్టు అయింది.

Read Also :Shruti Hasan: అమ్మా నాన్న విడిపోవడం నా జీవితంలో బాగా బాధపెట్టిన సంఘటన: శ్రుతి హాసన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870